Students jumping from running train

రన్నింగ్ ట్రైన్ నుంచి దూకిన విద్యార్థులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నిర్మల్ జిల్లాలోని బాసర రైల్వే స్టేషన్ లో విద్యార్థులు రన్నింగ్ ట్రైన్ నుంచి కిందికి దూకారు. దీంతో ఓ విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి.

నిర్మల్ జిల్లాలోని బాసర రైల్వే స్టేషన్ లో విద్యార్థులు రన్నింగ్ ట్రైన్ నుంచి కిందికి దూకారు. దీంతో ఓ విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఐఐఐటీ విద్యార్థులు ఒక ట్రైన్ అనుకుని మరో ట్రైన్ ఎక్కారు. రైలు కదిలాకా పొరపాటు గమనించిన విద్యార్థులు.. కదులుతున్న ట్రైన్ నుంచి కిందికి దూకేశారు. దీంతో విద్యార్థులకు గాయాలు అయ్యాయి. అధికారులు వీరిని అంబులెన్స్ లో ఐఐఐటీకి తరలించారు. గాయపడిన విద్యార్థులకు యూనివర్సిటీ ప్రాంగంణంలోని ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

బాసర ఐఐఐటీ నుంచి 106 మంది విద్యార్థులు హైదరాబాద్ వెళ్లాల్సివుండగా బాసర రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున రైల్వే స్టేషన్ లో ముగ్గురు విద్యార్థులు ఒక రైలుకు బదులు మరో రైలు ఎక్కారు. ఆ ముగ్గురు విద్యార్థులు రన్నింగ్ రైలు నుంచి దిగారు. 

వీరిలో ఒక విద్యార్థి తలకు బలమైన గాయం కావడంతో అతన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా వారికి ఐఐఐటీలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ లో ఎంపీపీఎల్ ఎగ్జామ్ రాయడానికి బాసర ఐఐఐటీ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
 

Related Posts