లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

విక్టరీ వెంకటేష్ 74 – ‘‘నారప్ప’’

విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ‘అసురన్’ రీమేక్ తెలుగు టైటిల్ ‘నారప్ప’.. ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల..

Published

on

Stunning First Look Posters Of Victory Venkatesh As Naarappa

విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ‘అసురన్’ రీమేక్ తెలుగు టైటిల్ ‘నారప్ప’.. ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల..

తమిళ స్టార్ హీరో ధనుష్, వెట్రి మారన్ కాంబినేషన్లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘అసురన్’.. గతేడాది దసరా కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. రా కంటెంట్‌తో రియలిస్టిక్‌గా తెరకెక్కిన ‘అసురన్’ చిత్రాన్ని విక్టరీ వెంకటేష్.. తెలుగు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.. 

Image

తమిళ నిర్మాత, వి. క్రియేషన్స్ బ్యానర్ అధినేత కలైపులి థాను, సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తుండగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా వెంకటేష్ ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. వెంకటేష్ నటిస్తున్న 74వ సినిమా ఇది. ‘‘నారప్ప’’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

Read Also : హ్యాపీ బర్త్‌డే నమ్రత – శ్రీమతికి శుభాకాంక్షలు తెలిపిన సూపర్‌స్టార్

Image

వెంకీ గెటప్, బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫస్ట్ లుక్ పేరిట విడుదల చేసిన పోస్టర్స్ ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. జనవరి 22 నుండి రాయలసీమలోని అనంతపురం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభం కానుంది. దాదాపు 3 వారాల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. కథానాయికతో పాటు మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. కెమెరా : శ్యామ్ కె నాయుడు, ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం : మణిశర్మ.

Image

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *