స్టార్ డైరెక్టర్‌తో స్టైలిష్ స్టార్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అల్లు శత సంవత్సర సంబరారంభం సందర్భంగా అల్లు అర్జున్ కొత్త సినిమాను ప్రకటించారు. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ను మెసేజ్ జోడించి చెప్ప‌గ‌ల స్టార్ డైరెక్టర్ కొర‌టాల శివ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో.. గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ తో కలిసి, కొరటాల స్నేహితుడు, యువసుధ ఆర్ట్స్ అధినేత సుధాకర్ మిక్కిలినేని ప్రొడక్షన్ నెం:1 గా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బన్నీ నటిస్తున్న 21వ సినిమా ఇది.పలు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నారు. శాండీ, స్వాతి, న‌ట్టి స‌హ నిర్మాత‌లుగా వ్య‌వ‌హరిస్తున్నారు. 2021లో ద్వితీయార్థంలో షూటింగ్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది. 2022 ప్ర‌థ‌మార్థంలో సినిమాను విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు. బన్నీ, సుకుమార్ కాంబోలో రూపొందనున్న ‘పుష్ప’, చిరు, కొరటాల కలయిలకలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాల తర్వాతే #AA21 పట్టాలెక్కనుంది.AA 21Related Posts