లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

సురేష్ బాబు సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్!

Published

on

ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా హాళ్లు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియదు. ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఓటీటీలవైపే మొగ్గు చూపుతున్నారు. కొత్త కొత్త సినిమాలు, సరికొత్త కంటెంట్‌తో రూపొందుతున్న వెబ్ సిరీస్‌లకు అలవాటు పడిపోయారు ఆడియెన్స్. విడుదల కాకుండా ఆగిపోయిన సినిమాలను ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ద్వారా రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు నిర్మాతలు. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెలుగులో తొలి ఓటీటీ ‘ఆహా’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో అభిరుచిగల నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. ఓటీటీని బేస్ చేసుకుని ఓటీటీకి సరిపడే సినిమాలు, వెబ్ సిరీస్ నిర్మిస్తాను కానీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించే ఆలోచనలేదని గతంలో చెప్పిన సురేష్ బాబు ఇప్పుడు తన ఆలోచనను మార్చుకుని సొంతగా ఓ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్నారట. ఓటీటీని స్థితిగతుల్ని పరిశీలించిన తర్వాత ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారని టాక్.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *