మొత్తం కృష్ణ జన్మభూమిని మాకప్పగించండి, అయోధ్యను మించిన గుడి కడతాం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Shri Krishna Janmabhoomi land: అయోధ్య రామ్ మందిర తీర్పు కొందరకి ధైర్యమిస్తున్నట్లే ఉంది. మధుర పట్టణంలోని మొత్తం కృష్ణ జన్మభూమి మాదే, తిరిగి అప్పగించడంటూ మధుర సివిల్ కోర్టులో తాజా దావా దాఖలైంది. శ్రీకృష్ణ జన్మభూమి పక్కనే షాహి ఈద్గా మసీదుంది. దాన్ని తొలగించి మొత్తం భూమిని అప్పగించాలంటూ ‘భగవాన్ శ్రీ కృష్ణ విరాజ్మన్’ తరపున మధుర కోర్టులో దావా వేశారు. రాయల్ ఇద్గా మసీదు ఉన్న ప్రదేశం శ్రీకృష్ణుడు జన్మించిన కారాగారమని దావాలో వాదించారు.

13.37 ఎకరాల ‘శ్రీ కృష్ణ జన్మభూమి’ ప్రక్కనే ఉన్న షాహి ఈద్గా మసీదును తొలగించాలన్నది డిమాండ్. ఈ భూమి యొక్క ప్రతి అంగుళం, శ్రీ కృష్ణుడి భక్తులకు, హిందువులకు పవిత్రమైనదని ‘భగవాన్ శ్రీ కృష్ణ విరాజ్మన్’ కొద్దికాలంగా వాదిస్తోంది.అయోధ్యలో రామ్ జన్మభూమి తర్వాత మధుర, కాశీలను కూడా విడిపించాల్సిన అవసరం ఉన్నదని బీజేపీ నాయకుడు వినయ్ కటియార్ అంతకు ముందే అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ మాత్రం, అయోధ్యను మిగిలిన పవిత్ర ప్రదేశాలకు ముడిపెట్టడాన్ని ఒప్పుకోవడంలేదు.

ఈ పిటిషన్‌తో ట్రస్ట్‌కు ఎటువంటి సంబంధం లేదని శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థ ట్రస్ట్ (శ్రీ కృష్ణ జన్మభూమి న్యాస్) కార్యదర్శి కపిల్ శర్మ అంటున్నారు.భగవాన్‌ శ్రీకృష్ణ విరాజ్మాన్‌ దాఖలు చేసిన దావా అసంబద్ధమైనదని హాజీ మెహబూబ్ విమర్శించారు. రామ్ మందిర్ బాబ్రీ మసీదు కేసు మినహా, మరో దావా వేయడానికి సుప్రీంకోర్టు నో చెప్పిందన్నారు.

అయోధ్య తరహాలోనే, 1951‌లో శ్రీ కృష్ణ జన్మభూమి ట్రస్ట్‌ను ఏర్పాటుచేశారు. ఉద్దేశం అక్కడ ఆలయాన్ని నిర్మించడం. ఆ తర్వాతే అంటే 1958లో శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ సంస్థ ఏర్పడింది.దీనికి ఎలాంటి అధికారులు, భూమిలేదు.

DPD/Aug.49, A04b.The site celebrated as the birth place of Lord Krishna. Shri Krishna, as tradition goes, was born in a prison and the prison is said to have existed on the plot marked by a stone plate. To the right of it is the idgah..
ఈ సంస్థ మొత్తం భూమిని నియంత్రించడానికి 1964 లో సివిల్ కేసు వేసినా, నాలుగేళ్లకు ముస్లిం పక్షంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ముస్లిం వర్గం తమ కొంత భాగాన్ని ఆలయం కోసం వదిలివేస్తే, బదులుగా సమీపంలోని మరో స్థలం ఇచ్చారు.

Related Tags :

Related Posts :