క్రేజీ కాంబో: సుక్కూ- విజయ్ Pan India Movie

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Sukumar – Vijay Deverakonda: సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కబోతోంది. ఈ సినిమాతో కేదార్ సెలగంశెట్టి అనే యువ నిర్మాత తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.


ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సినిమాల మీద ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చిన కేదార్ భవిష్యత్‌లో వరుసగా సినిమాలు చేయబోతున్నారు.అందులో భాగంగా తన మొదటి సినిమాను స్టార్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ సుకుమార్‌లతో పాన్ ఇండియా లెవల్లో నిర్మించనున్నట్లు తన పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ : “ఈ పుట్టిన రోజు నాకు చాలా స్పెషల్. నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తులు విజయ్ దేవరకొండ, సుకుమార్ గార్లతో నా మొదటి సినిమా అనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది. ఈ సినిమా 2022 లో మొదలు కాబోతుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా ఉండబోతుంది.


ఈ కాంబినేషన్ అనగానే అందరికి చాలా అంచనాలుంటాయి. విజయ్, సుకుమార్ ఇద్దరూ కొత్తదనాన్ని బాగా ఇష్టపడతారు. వాళ్ళ సినిమాలు కూడా అలాగే ఉంటాయి. వాళ్ళిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమా కూడా వాళ్ళ స్టైల్ లోనే ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించి మిగతా వివరాలు తర్వాత తెలియజేస్తాం.” అన్నారు.


ప్రస్తుతం అల్లు అర్జున్ తో చేస్తున్న ‘పుష్ప’ పూర్తవగానే సుకుమార్ ఈ కథపై వర్క్ చేయనున్నారు. ఈలోగా విజయ్, పూరి జగన్నాథ్ (ఫైటర్) చిత్రాన్ని కంప్లీట్ చేయబోతున్నాడు.

Related Tags :

Related Posts :