కరోనా నుంచి కోలుకున్నా… సీనియర్ నటీమణి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

త‌ను క‌రోనా ల‌క్ష‌ణాల నుంచి పూర్తిగా కోలుకున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు సీనియర్ న‌టీ, మండ్య ఎంపీ సుమ‌ల‌తా అంబరీష్. ఆమె వ‌య‌సు 56 సంవ‌త్స‌రాలు. త‌ను క‌రోనా వైర‌స్‌కు గురైన‌ట్టుగా కొన్ని రోజుల కింద‌ట సుమ‌ల‌త ప్ర‌క‌టించారు. ట్రీట్‌మెంట్ తీసుకోబోతున్న‌ట్టుగా కూడా ఆమె అప్ప‌ట్లో ప్ర‌క‌టించారు. త‌న‌కు కోవిడ్-19 పాజిటివ్‌ గా తేలిన విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించిన సుమ‌ల‌త‌, ఇప్పుడు త‌న‌కు క‌రోనా రిజ‌ల్ట్ నెగిటివ్ వ‌చ్చిందంటూ చెప్పారు. తన‌కు వైద్యం అందించిన డాక్ట‌ర్ల‌కు, త‌న శ్రేయోభిలాషుల‌కు సుమ‌ల‌త ధ‌న్య‌వాదాలు చెబుతూ పోస్టు చేశారు.

Sumalatha Ambareesh

మూడు వారాల పాటు త‌ను పూర్తిగా క్వారెంటైన్లో ఉన్న‌ట్టుగా సుమ‌ల‌త తెలిపారు. వైద్యుల స‌హ‌కారంతో త‌ను కోలుకున్న‌ట్టుగా, మ‌రి కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాల‌ని వారు త‌న‌కు సూచించార‌ని ఈ ఎంపీ ప్ర‌క‌టించారు. క‌రోనా సోక‌డం నేర‌మేమీ కాద‌ని, క‌రోనా సోకిన వారి ప‌ట్ల వివ‌క్ష కూడ‌ద‌న్న‌ట్టుగా సుమ‌ల‌త త‌న పోస్టులో పేర్కొన్నారు.
ప్ర‌స్తుతం క‌రోనా పై యుద్ధం జ‌రుగుతోంద‌ని, కోవిడ్ పాజిటివ్ గా తేలిన వాళ్లు యుద్ధంలో పోరాడుతున్న వారే అని, క‌రోనా సోకింద‌ని సిగ్గుప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆమె అన్నారు. కరోనా సోకిన వారు వైద్యుల సూచ‌న‌లు పాటించి, క‌రోనా నుంచి కోలుకోవాల‌ని ఆమె సూచించారు.

Related Posts