లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
× About Services Clients Contact
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

కన్నడ రీమేక్ ‘కావలూధారి’ షూటింగ్ ప్రారంభం

సుమంత్‌, నందిత‌ా శ్వేత జంటగా నటిస్తున్న కన్నడ రీమేక్ ‘కావ‌లూధారి’ తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కుతుంది..

Published

on

Sumanth New Movie Shooting Begins

సుమంత్‌, నందిత‌ా శ్వేత జంటగా నటిస్తున్న కన్నడ రీమేక్ ‘కావ‌లూధారి’ తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కుతుంది..

వైవిధ్య‌మైన క‌థాశాలంతో సినిమాలు చేస్తూ హీరోగా త‌న‌కంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న క‌థానాయ‌కుడు సుమంత్‌ ఇటీవలే మలయాళ చిత్రం ‘పాదయోట్టం’ రీమేక్‌లో నటించనున్నట్టు ప్రకటించాడు. ఇప్పుడు మరో కొత్త సినిమా కన్ఫమ్ చేశాడు. ఇదీ కూడా రీమేకే కావడం విశేషం. సుమంత్ హీరోగా క‌న్న‌డ మూవీ ‘కావ‌లూధారి’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు. శుక్ర‌వారం(న‌వంబ‌ర్ 1) నుండి రెగ్యుల‌ర్ షూటింగ్‌ చెన్నైలో స్టార్ట్ చేశారు.

ఈ చిత్రాన్ని క‌న్న‌డలో పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నిర్మించారు. అక్కడ చాలా పెద్ద హిట్ అయ్యింది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌ను తెలుగు, త‌మిళ భాష‌ల్లో.. క్రియేటివ్ ఎంట‌ర్‌టైన‌ర్స్ బ్యాన‌ర్‌పై డా.జి.ధ‌నంజ‌య‌న్  రీమేక్ చేయ‌బోతున్నారు. సుమంత్‌, నందిత‌ా శ్వేత, పూజాకుమార్‌, నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, వెన్నెల కిశోర్ కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు… 

Read Aso : జయం రవి 25th ఫిలిం ‘భూమి’ : ఫస్ట్ లుక్

ఇటీవ‌ల విడులైన విజ‌య‌వంత‌మైన విజ‌య్ ఆంటోని ‘కిల్ల‌ర్‌’ చిత్రంతో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మంచి పేరు తెచ్చుకున్న‌ సిమ‌న్ కె.కింగ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చనుండగా.. డా.ధ‌నుంజ‌య‌న్ స్క్రీన్‌ప్లే అడాప్ష‌న్, బాషాశ్రీ మాట‌లు అందిస్తున్నారు. విజ‌య్ ఆంటోనితో ‘భేతాళుడు’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. చెన్నై, హైద‌రాబాద్ ప్రాంతాల్లో జ‌న‌వ‌రిలో జరిగే సింగిల్ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తారు. మార్చి నెల‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

క‌థ‌ : హేమంత్ ఎం.రావు, మాట‌లు : బాషా శ్రీ, స్క్రీన్ ప్లే అడాప్ష‌న్‌ : డా.జి.ధ‌నంజ‌య‌న్‌, మ్యూజిక్‌ : సిమ‌న్ కె.కింగ్‌, ఎడిటింగ్‌ : ప్ర‌వీణ్ కె.ఎల్‌, యాక్ష‌న్‌ : స‌్టంట్ సిల్వ‌, ఆర్ట్‌ : విదేశ్‌, నిర్మాత‌ : డా.జి.ధ‌నంజ‌య‌న్‌, ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి

 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *