లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

రైతన్నల నిరసనలకు మద్దతుగా అక్కాచెల్లెళ్ల పాట…

Published

on

‘sun dilliye ni sun dilliy’ mohali sisters song : ప్రధాని నరేంద్రమోడీ తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు అలుపెరుగకుండా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. వారాలా తరబడి అలుపెరకుండా రైతులు చేస్తున్న పోరాటాలకు ఎన్నో వర్గాల నుంచి సంస్థల నుంచి మద్దతు లభిస్తోంది. అయినా కేంద్రం మనస్సు కరగటంలేదు. చట్టాలను మార్చే ప్రసక్తే లేదంటోంది.

దేశవ్యాప్తంగానే కాకుండా రైతుల పోరాటానికి విదేశాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు రైతన్నలకు మద్దతు మేమున్నామంటూ తమ గానంతో సాటిచెబుతున్నారు. సొంతంగా పాట రాసి దానికి వారే స్వయంగా మ్యూజిక్ కంపోజ్ చేసి అద్భుతంగా పాటపాడి రైతులకు తమ మద్ధతు తెలిపారు. అ అక్కాచెల్లెళ్లు పాడిన పాట వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. పాట విన్నప్రతీ ఒక్కరూ ఆ సింగర్ సిస్టర్స్​ను ప్రశంసిస్తున్నారు. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్​లో పోస్ట్​ గ్రాడ్యుయేట్స్ అయిన సిమృత, రమ్​నీక్ రైతన్న కోసం పాట రాసి మ్యూజిక్ కంపోజ్ చేసి పాట పడారు. “సున్​ దిలియే ని సున్ దిలియే” అంటూ సాగిన ఈ గీతాన్ని విన్నవారు అద్భుతమని ప్రశంసిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన తమ పాట గురించి సిమృత మాట్లాడుతూ..‘అందరికి అన్నం పెట్టే రైతన్నల కోసం ఓ పాట పాడాలనుకున్నాం..కానీ తాము పాడిన ఈ పాట ఇంత పాపులర్ అవుతుందని మేం అనుకోలేదు..మా పాట విన్న ప్రతి ఒక్కరూ మంచి ఫీడ్​బ్యాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఉద్యమంలో పాల్గొంటున్న నాయకులు ఈ పాటను ఇష్టపడుతుండడం చాలా సంతోషంగా ఉంది’ అని సిమృత చాలా ఆనందపడుతూ చెప్పారు.

కానీ ఈ సిస్టర్స్ స్వతహాగా రచయితలు కాకపోయినా రైతుల మీద వారుకున్న ప్రేమాభిమానాలు వారితో పాటకు అద్భుతమైన పదాలనిచ్చాయి. అద్భుతంగా లిరిక్స్ రాసి మ్యూజిక్ కంపోజ్ చేసుకుని మీర పాడారు. వేలాది మంది రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం కనికరించటంలేదు. ఇది చాలా బాధకలిగిస్తోందని రమ్​నీక్​ అన్నారు.

మొహాలికి చెందిన ఈ అక్కాచెలెళ్లలది రైతు కుటుంబ నేపథ్యం. ఈ పాటను రూపొందించేందుకు తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారని వారు తెలిపారు. “ రైతుల ఉద్యమానికి మద్దతుగా పాట పడడం పట్ల మా తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. సపోర్ట్​ చేశారు” అని అన్నారు. వీరిలో మరో సిస్టర్ రమ్ నీక్ మాట్లాడుతూ..అంత చలి, కఠిన పరిస్థితుల్లోనూ తమ పిల్లలు ఉద్యమంలో పాల్గొనేలా తల్లులు ప్రోత్సహించడం తమను కదిలించిందని, ఆ స్ఫూర్తి, ఎంతో గొప్పదని చెప్పారు. ఈ మోహాలీ సిస్టర్స్ పాటకు సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో ప్రశంసలు దక్కుతున్నాయి. సాంగ్ అద్భుతంగా ఉందంటూ.ఎంతోమంది రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.