లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movie Reviews

‘సూపర్ ఓవర్’ రివ్యూ

Published

on

Super Over Review: నవీన్ చంద్ర, చాందిని చౌదరి, అజయ్, ప్రవీణ్ ప్రధాన పాత్రల్లో నటించగా ప్రవీణ్ వర్మ దర్శకత్వంలో సుధీర్ వర్మ నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ‘సూపర్ ఓవర్’.. ఈ సినిమా ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అయ్యింది.. ఇటీవలే నవీన్ చంద్ర నటించిన ‘భానుమతి & రామకృష్ణ’ ఆహాలో రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ పొందింది. మరి అలాగే ఈ ‘సూపర్ ఓవర్’ సినిమా నవీన్ చంద్రకు సక్సెస్ ఇచ్చిందా? దర్శకుడు సుధీర్ వర్మ కంటెంట్ మీద నమ్మకంతో తానే నిర్మించిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం….

కథ విషయానికొస్తే: కాశీ, వాసు, మధు ఈ ముగ్గురూ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్.. కాశీ us వెళ్ళే ట్రైల్స్‌లో వుంటాడు. వాసు ఓ కంపెనీలో జాబ్ చేస్తూ వుంటాడు. మధు హయ్యర్ స్టడీస్ చేస్తువుంటుంది. మధు తినడానికి పడుకోవడానికి మాత్రమే వాళ్ల ఇంటికి వెళ్తుంది. మిగతా టైం అంత కాశీ, వాసుల ఫ్లాట్‌లోనే వుంటుంది. ఒక రోజు కాశీకి వాళ్ల ఉరు నుంచి తన మావయ్య కాల్ చేసి అప్పు ఇచ్చిన వాళ్ళు నెలలో అప్పు తీర్చకపోతే ఇల్లు జప్తు చేస్తాము అంటున్నారు.. త్వరగా బాకీ తీర్చమని చెపుతాడు.. ఎలాగైనా డబ్బు సంపాదించి అప్పు తీర్చాలని ఆలోచిస్తూ వుంటాడు..

అదే టైం లో చిన్న నాటి ఫ్రెండ్ బంగార్రాజు వాళ్లకు హైదరాబాద్‌లో కనబడతాడు. క్రికెట్ బెట్టింగ్ బుకీగా మారాను అని, దాంతో తన జీవితం మారిపోయిందని చెబుతాడు. దాంతో కాశీ కూడా తన అప్పులు తీర్చుకోవడానికి క్రికెట్ బెట్టింగ్స్ కడతాడు. మధు కూడా కాశీకి సపోర్ట్ చేస్తుంది. అనుకోకుండా క్రికెట్ బెట్టింగ్‌లో కాశీ కోటి డెబ్భై లక్షలు గెలుచు కుంటాడు. ఆ డబ్బులను బుకీ మురళి హవాలా రూపంలో తీసుకోమంటాడు. హవాలా వ్యాపారుల నుంచి ఆ డబ్బులు తీసుకొనే క్రమంలో కాశీ, మధు, వాసులకు ఎదురైన పరిస్థితులు ఏమిటి? సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అజయ్ పాత్రేమిటి? బుకీ మురళి.. కాశీ వాళ్ళను ఎందుకు ఫాలో అవుతున్నాడు? ఆఖరికి ఆ డబ్బును హవాలా వాళ్ళ నుంచి తీసుకున్నారా.. లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..

నటీ నటుల విషయానికొస్తే: కాశీ పాత్రలో నవీన్ చంద్ర ఒదిగిపోయాడు. పాత్రకు తగిన విధంగా ఒక పక్క వీసా రాక, ఇంకోపక్క ఊళ్లో అప్పు తీర్చలేక, గెలిచిన డబ్బును చేజిక్కించుకొనే ప్రయత్నంలో తనదైన శైలిలో నటించి ఆకట్టుకున్నాడు. మధుగా నటించిన చాందిని చౌదరి, వాసుగా నటించిన రాకేందు మౌళి ఇద్దరూ పాత్రల పరిధి మేర కాశీ ఫ్రెండ్స్‌గా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి సినిమాకు ప్లస్ అయ్యారు. ఇక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అజయ్‌గా నటించిన అజయ్ తన నటనతో సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాడు అని చెప్పొచ్చు. బుకీ మురళిగా నటించిన ప్రవీణ్, బంగార్రాజుగా నటించిన వైవా హర్ష వంటి నటీ నటులందరూ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు..

టెక్నీషియన్స్ విషయానికొస్తే: రొటీన్ కథను ఎంచుకున్నా, దాన్ని స్క్రీన్‌ప్లే మాయాజాలంతో ఆకట్టుకొనేలా తెరకెక్కించాడు ప్రవీణ్ వర్మ. ఎంతో అనుభవం వున్న దర్శకుడిలా సినిమా కథా కథనాలను నడిపించాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. పాత్రలు, నటీనటుల దగ్గరనుంచి మెయిన్ టెక్నీషియన్స్ వరకు పర్ఫెక్ట్‌గా సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక సంగీత దర్శకుడు సన్నీ ఎమ్ఆర్ తన ఆర్‌ఆర్‌తో చిత్రానికి ప్రాణం పోశాడు. సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రాఫర్ తన విజువల్స్‌తో రిచ్‌నెస్ తీసుకొచ్చాడు. ప్రతీ ఫ్రేమ్ తనకిచ్చిన బడ్జెట్‌లో ఎంతో అందంగా తీర్చి దిద్దాడు. మిగతా డిపార్ట్‌మెంట్స్ అన్నీ కూడా డైరెక్టర్ విజన్‌కి తగ్గట్టు సినిమాని జనరంజకంగా మలచడంలో తమ వంతు కృషి చేశారు.
ఫైనల్‌గా చెప్పాలి అంటే.. రెగ్యులర్ స్టోరీనే అయినా ఎక్కడా బోర్ కొట్టదు. ఆడియన్స్‌కి నచ్చే విధంగా వినోదాత్మకంగా సాగే సినిమా.. ‘సూపర్ ఓవర్’.