మహేష్ Dual Role.. లుక్ అదిరిందిగా!..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Super Star Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు వెండితెరతో పాటు బుల్లితెర మీదా అలరిస్తుంటారు.. ఇప్పటికే పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించారు.. ప్రస్తుతం ఆయన చేతిలో పలు బ్రాండ్స్ ఉన్నాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సూపర్‌స్టార్ సినిమా షూటింగుకు ఇంకా టైమ్ ఉండడంతో యాడ్స్ షూటింగులో పాల్గొంటున్నారు.


తాజాగా మహేష్ నటించిన యాడ్ ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతోంది. ఎందుకంత విశేషం అంటే.. సూపర్‌స్టార్ ఇంతకుముందెన్నడూ కనిపించని సరికొత్త గెటప్‌లో కనిపించడం.. మహేష్ బాబు ఫ్లిప్‌కార్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ‘ఫ్లిప్‌కార్ట్ ది బిగ్‌ బిలియన్‌ డేస్‌’ షురూ అయినట్లుగా చెబుతూ మహేష్‌ బాబు మీద పిక్చరైజ్‌ చేసిన ఓ యాడ్ రిలీజ్ చేశారు. ఈ యాడ్‌లో మహేష్‌ బాబు Dual Role లో (అన్న, తమ్ముడు)గా కనిపించారు.


తమ్ముడికి అన్నయ్య.. ‘ఫ్లిప్‌కార్ట్ ది బిగ్‌ బిలియన్‌ డేస్‌’ గురించి ఈ యాడ్‌లో చెబుతున్నారు. పంచెకట్టు, మెలితిరిగిన మీసాలతో మరింత అందంగా కనిపించడంతో పాటు.. తెలంగాణ యాసలో డైలాగులు చెప్పడంతో ఈ యాడ్‌కు మరింత క్రేజ్ వచ్చింది.. ఈ ఏడాది సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ తో సూపర్ హిట్ కొట్టిన మహేష్.. త్వరలో ‘సర్కారువారి పాట’ షూటింగులో పాల్గొంటారు.

Related Tags :

Related Posts :