సూపర్ స్టార్ మహేశ్ HBDMaheshBabu వరల్డ్ రికార్డు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సూపర్ స్టార్ మహేశ్ క్రేజ్ మరోసారి వరల్డ్ రికార్డు కొట్టేసింది. ఆదివారం మహేశ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా ముఖ్యంగా ట్విట్టర్లో విషెస్ మోత మోగిపోయింది. #HBDMaheshBabu అనే హ్యాష్ ట్యాగ్ తో రోజంతా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. మహేశ్ కు చెప్పిన ట్వీట్ విషెస్ తో వరల్డ్ రికార్డు నమోదైంది.

గడిచిన 24 గంటల్లో 60.2 మిలియన్ల ట్వీట్లతో హ్యాష్ ట్యాగ్ హల్ చల్ చేస్తుంది. ఇది వరల్డ్‌ రికార్డు అని మహేశ్‌బాబు పీఆర్‌ టీమ్‌ వెల్లడించింది. రోజు పూర్తయ్యేసరికి ఇంకొన్ని మిలియన్ల ట్వీట్లు చేరడం ఖాయం.

చివరిగా సినిమా అయిన ‘సరిలేరు నీకెవ్వరు’లో కనిపించిన మహేశ్.. ఏడాది ఆరంభంలో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో హిట్‌ కొట్టేశాడు. నెక్ట్స్ ప్రాజెక్టుగా పరశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ షూటింగ్‌ మొదలవ్వాల్సి ఉంది. దీనికి కరోనా వైరస్ లాక్‌డౌన్‌ ఆటంకం సృష్టించింది.

బర్త్ డే సందర్భంగా ‘సర్కారు వారి పాట’ యూనిట్‌ మోషన్‌ పోస్టర్‌ విడుదల చేసింది. బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ అభిమానులకు పండుగగా మారింది.

Related Tags :

Related Posts :