మరో ఇద్దరు చిన్నారులకు మహేష్ గుండె ఆపరేషన్.. నమ్రత ఎమోషనల్ పోస్ట్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Mahesh Babu: సూపర్‌స్టార్‌ Mahesh Babu తెరమీదే కాదు తెరవెనుక కూడా హీరో అనిపించుకుంటున్నారు. ‘శ్రీమంతుడు’ స్ఫూర్తితో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేశారు.
అలాగే కొద్ది కాలంగా ఆంధ్రా హాస్పిటల్స్‌, లిటిల్‌ హార్ట్స్‌ ఫౌండేషన్స్‌తో కలిసి చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయిస్తూ వారికి పునర్జన్మనందిస్తున్నారు.

Mahesh Babu

గడచిన మూడున్నరేళ్లలో వెయ్యి మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్‌ చేయించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు సూపర్‌స్టార్.. తాజాగా Andhra Hospitals, Healing Little Hearts Foundation ఆధ్వర్యంలో మరో ఇద్దరు చిన్నారులకు గుండె ఆపరేషన్స్ జరిగాయి. ఈ విషయాన్ని Namrata Shirodkar తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.


‘‘మరో రెండు గుండెలు మా కుటుంబంతో కలిశాయి. ఇటీవల గుండె ఆపరేషన్స్‌ చేయించుకున్న ఇద్దరు చిన్నారుల ఆరోగ్యం కుదుటపడడంతో వారు డిశ్చార్జ్ అయ్యారని తెలియజేయడానికి సంతోషపడుతున్నాం. క్లిష్ట సమయాల్లో కూడా సాధ్యమైనంత ఉత్తమమైన ఆరోగ్య సంరక్షణను అందించినందుకు ఆంధ్రా హాస్పిటల్స్‌ వారికి థ్యాంక్స్’’ అని నమ్రత పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్, నెటిజన్లు, సినీ ప్రముఖులు మహేష్ బాబు రియల్ హీరో అంటూ అభినందిస్తున్నారు.

Related Posts