లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

ప్రశాంత్ భూషణ్ కు Rs. 1 జరిమాన…అప్పటిలోగా కట్టకపోతే..మూడేళ్ల జైలు శిక్ష

Published

on

న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు జరిమాన విధించింది. 2020, ఆగస్టు 31వ తేదీ సోమవారం తీర్పును వెలువరించింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డేతో పాటు సుప్రీం న్యాయమూర్తులను విమర్శించిన కేసులో.. ప్రశాంత్ భూషణ్‌కు ఒక రూపాయి జరిమానా విధించారు.ఇందుకు గడువుగా విధించింది. ఆ ఒక్క రూపాయి..సెప్టెంబర్ 15వ తేదీలోగా కట్టాలని వెలువరించింది. అప్పటిలోగా కట్టకపోతే..మాత్రం మూడు నెలల పాటు జైలు శిక్ష లేదా..మూడేళ్ల పాటు..న్యాయవాది వృత్తిలో కొనసాగరాదు అని సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించింది.

వివాదాస్పద ట్వీట్లు చేస్తూ..ప్రశాంత్ భూషణ్ వార్తల్లోకి ఎక్కారు. దీనిపై క్షమాపణలు చెప్పాలని సుప్రీం సూచించింది. దీనికి ఆయన నో చెప్పారు. ఆయన్ను హెచ్చరించి వదిలేయాలని కేంద్రం సుప్రీంను కోరింది.రెండు సార్లు అవకాశం ఇచ్చిన ప్రశాంత్ భూషణ్ తన పంతం వీడలేదు. క్షమాపణలను చెప్పడం అంటే అంతరాత్మను ధిక్కరించడమే అవుతుందని కూడా ప్రశాంత్ కామెంట్ చేశారు.

బాల్కనీ బాగాలేదనే రైనా వచ్చేశాడా.. విజయం తలకెక్కిందంటూ సూపర్ కింగ్స్ యజమాని కామెంట్లు


గతంలో ట్విటర్లో ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తికి, ఆయనకు ముందు సీజేఐలుగా ఉన్న మరో నలుగురి గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని, ఇవి కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని ఇటీవల సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఇది కోర్టు ధిక్కరణకు సంబంధించిన తీవ్రమైన విషయం అని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవి, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా ఈనెల 14న జస్టిస్ అరుణ్ మిశ్రా ఆధ్వర్యంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రకటించింది. రివ్యూ పిటిషన్ దాఖలు చేసి, దానిపై కోర్టు ఒక నిర్ణయానికి వచ్చేంత వరకూ తనకు వేసే శిక్షకు సంబంధించిన విచారణను వాయిదా వేయాలని ప్రశాంత్ భూషణ్ కోరారు. ఆ విజ్ఞప్తిని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోనే బెంచ్ తోసిపుచ్చింది.

కోర్టు శిక్ష విధించాలనుకుంటే ఎలాంటి శిక్షనైనా నవ్వుతూ భరిస్తాను’ అని మహాత్మాగాంధీని ఉటంకిస్తూ ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డట్టు భావించిన నా ట్వీట్లు… నా బాధ్యత. ఇంకేం కాదు. వాటిని వ్యవస్థను మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా చూడాలి. నేను రాసినది నా వ్యక్తిగత అభిప్రాయం. నా విశ్వాసాలు, అభిప్రాయాలను వ్యక్త పరిచే హక్కు నాకు ఉంది అని ప్రశాంత్ భూషణ్ అన్నారు. చివరకు రూ. 1 జరిమాన విధిస్తూ సుప్రీం తీర్పును వెలువరించింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *