తల్లిదండ్రులు అడిగారని నిర్ణయం తీసుకోలేం.. మాతృభాషపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

mother tongue in primary schools : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో స్కూళ్లలో ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండటం చాలా ముఖ్యమని సీజేఐ అభిప్రాయపడింది. అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఇంగ్లీష్‌తో పాటు ప్రాథమిక విద్య మాతృభాషలో విద్యా భోదన కొనసాగుతోందని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీలో ఇంగ్లీష్ మీడియం అంశంపై మంగళవారం (అక్టోబర్ 6)న విచారణ జరిగింది.ఇంగ్లీష్ మీడియం అంశంపై హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులు తొలగించాలని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేస్తూ తెచ్చి జీవోలు 81, 85లను హైకోర్టు రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలుచేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ. బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారించింది. ఒక సబ్జెక్టుగా తెలుగును కూడా ఉంచిందని ప్రభుత్వ తరపు న్యాయవాది విశ్వనాథన్ సుప్రీంకు విన్నవించారు.ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజులు కట్టలేక పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారని విశ్వనాథన్ వాదించారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియాన్ని తెచ్చిందని విశ్వనాథన్ తెలిపారు. దాంతో సుప్రీం ధర్మాసనం.. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండటం ముఖ్యమని అభిప్రాయపడింది. ఇంగ్లీష్ మీడియం అంశంపై వచ్చే వారం విచారిస్తామని సీజేఐ తెలిపింది.

ఏపీలో ఇంగ్లీష్‌ మీడియం అమలుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వం వేసిన పిటీషన్‌ను ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో మాతృభాషలోనే విద్యా బోధన కొనసాగుతుందని చీఫ్ జస్టిస్ బాబ్డే వ్యాఖ్యానించారు. 96 శాతం తల్లిదండ్రులు కోరినంత మాత్రాన నిర్ణయం తీసుకోలేమన్నారు. పునాది గట్టిగా ఉంటే తర్వాత ఏ భాషనైనా అలవోకగా నేర్చుకోవచ్చని జస్టిస్ బాబ్డే అభిప్రాయపడ్డారు. తదుపరి విచారణను మరో వారం పాటు వాయిదా వేశారు.

Related Tags :

Related Posts :