suresh family reaction on tahsildar murder

వివాదం ఇదే : తహశీల్దార్ హత్యపై స్పందించిన నిందితుడు సురేష్ బంధువులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనపై నిందితుడు సురేష్ బంధువులు స్పందించారు. సురేష్ ఇలా చేశాడని తెలిసి తాము షాక్ కి గురయ్యామని సురేష్ తల్లి, చెల్లి,

అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనపై నిందితుడు సురేష్ బంధువులు స్పందించారు. సురేష్ ఇలా చేశాడని తెలిసి తాము షాక్ కి గురయ్యామని సురేష్ తల్లి, చెల్లి, పెదనాన్న చెప్పారు. భూ వివాదం నడుస్తున్న మాట వాస్తవమే అని సురేష్ పెదనాన్న తెలిపారు. బాచారం సర్వే నెంబర్ 90 నుంచి 101 వరకు భూమి ఉందని.. దీనికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోందని ఆయన వివరించారు. భూమికి సంబంధించి పేర్లు మార్చాల్సి ఉందన్నారు. దీని గురించి తహశీల్దార్ విజయారెడ్డితో సురేష్ పలుమార్లు మాట్లాడినట్టు చెప్పారు. పేర్ల మార్పుకి సంబంధించి విజ్ఞప్తి చేశాడన్నారు. అయితే.. మండలాలు మారాయి.. ఇప్పుడు మార్పులు చేయడం కుదరదు అని తహశీల్దార్ చెప్పారని ఆయన తెలిపారు.

ఆ తర్వాత కొన్ని రోజులకు.. తమకు సంబంధించిన భూమిని తమ ప్రత్యర్థుల పేరున ఆన్ లైన్ లో నమోదు చేశారని సురేష్ పెదనాన్న ఆరోపించారు. కోర్టులో కేసు నడుస్తున్నా, స్టే ఆర్డర్ ఉన్నా.. తహశీల్దార్ భూమిని తమ ప్రత్యర్థుల పేరున రాశారని వాపోయారు. 2016 నుంచి 2019 వరకు ఈ కేసు నడిచిందన్నారు.

కాగా, ఈ ఘటనపై సురేష్ తల్లి, చెల్లి మరోలా స్పందించారు. భూ వివాదం గురించి తమకు ఏమీ తెలియదన్నారు. సురేష్ ఏ రోజు కూడా భూ వివాదం గురించి తమతో చెప్పలేదన్నారు. ఎప్పటిలాగే సోమవారం కూడా సురేష్ బయటకు వెళ్లాడని చెప్పారు. పోలీసులు చెప్పాకే తహశీల్దార్ హత్య గురించి తమకు తెలిసిందన్నారు. నిందితుడు కూర సురేష్ రైతు. హయత్ నగర్ మండలం గౌరెల్లి గ్రామం సురేష్ స్వస్థలం.

హైదరాబాద్‌ నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్‌ విజయారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. సురేష్ అనే రైతు.. కార్యాలయంలోనే విజయారెడ్డిపై పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో రైతు సురేష్ తహశీల్దార్‌ ఛాంబర్‌లోకి ప్రవేశించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తనకు తాను నిప్పంటించుకున్నాడు. తహశీల్దార్‌ను కాపాడే యత్నంలో ఇద్దరు సిబ్బందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన తహశీల్దార్‌ డ్రైవర్‌తో పాటు అటెండర్‌ను హయత్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Related Posts