లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

తండ్రి చేతుల్లో  దారుణంగా హింసకు గురైన 54 రోజుల పసికందుకు సర్జరీ

Published

on

Surgery For 54-Day-Old Kerala Baby After Father Allegedly Hit Her On Head

తండ్రి చిదకబాదడంతో 54 రోజుల పసికందు అపస్మారక స్థితికి చేరుకోవడంతో పాటు వింతైన సమస్యతో బాధపడుతుంది. విషమ పరిస్థితిలో ఉన్న పసికందుకు ఈ రోజు చికిత్స చేయనున్నారు. మెదడులోని పొరల మధ్య రక్తం గడ్డ కట్టి సబ్‌డ్యూరల్ హేమరేజ్ సమస్య మొదలైంది. కేరళలోని యర్నాకులం జిల్లాలోని  నియోనాటల్ ఐసీయూలో ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉంచారు. 

‘చిన్నారిని దారుణంగా కొట్టిన తండ్రి.. తలపై బలంగా తన్నడంతో పాటు మంచం మీదకు విసిరేశాడు. ఇంటర్నల్ బ్లీడింగ్ అవతుండటంతో పసిబిడ్డను హాస్పిటల్ లో చేర్పించారు. రాత్రంతా చిన్నారి ఏడుస్తుండటంతో హాస్పిటల్ కు తీసుకురాగా విషయం తెలిసింది. ఆ పసికందుపై తండ్రి రాక్షసత్వం చూపించడం తొలిసారేం కాదు. 

‘తల్లి చెప్పిన మాటల ప్రకారం.. గతంలోనూ ఓసారి పసిబిడ్డను కొట్టాడు. తాగుబోతు అయిన వ్యక్తి చనిపోతే ఏమవుతుందని కూడా ప్రశ్నించాడట. అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద దర్యాప్తు జరుపుతున్నట్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టీకే జాస్సీ అన్నారు. 

నిందితుడు 40ఏళ్ల షైజు థామస్‌ను 14రోజుల జ్యూడిషియల్ కస్టడీకి పంపారు. ఈ షాకింగ్ కేసుతో హాస్పిటల్ అథారిటీలను అలర్ట్ చేశారు పోలీసులు. చిన్నారిని హాస్పిటల్ లో చేర్పించగానే తండ్రి స్టేట్‌మెంట్ మార్చి చెప్పడం మొదలుపెట్టాడు. MOSC Medical College Hospitalలో పసిబిడ్డకు ట్రీట్‌మెంట్ జరుగుతుంది. 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *