తెరమీద అసలు లిప్‌లాక్ చెయ్యలేదు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Kajal Aggarwal Kiss Making Scene About: ‘ఇంగ్లీష్ సినిమా అంటే ముద్దు తెలుగు సినిమా అన్నాక హద్దు ఉండాలి’ అనేమాట సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎక్కువగా వినిపించేది. హాలీవుడ్, బాలీవుడ్ ఆ తర్వాత మన టాలీవుడ్‌కి కూడా ఈ ముద్దు కల్చర్ పాకింది. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో హీరో హీరోయిన్ కౌగలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటివన్నీ కెమెరా ట్రిక్స్ అని చెప్పేవాళ్లు. రాను రాను ముద్దులు హద్దులుదాటి లిప్‌లాక్‌లు, అతిగాఢమైన అధర చుంబనాలు వచ్చేశాయి.Kajalతాజాగా తాను ఓ సినిమాలో అసలు లిప్‌లాక్ చేయలేదు కానీ చేసినట్లు చూపించారంటూ కలువకళ్ల చిన్నది కాజల్ అగర్వాల్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. తమిళ స్టార్ హీరో సూర్య, కాజల్ అగర్వాల్ జంటగా(సూర్య ద్విపాత్రాభినయం) పాపులర్ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్(‘రంగం’ ఫేమ్) కె.వి. ఆనంద్ దర్శకత్వంలో ‘మాట్రాన్’(Maattrraan) అనే సినిమా వచ్చింది. తెలుగులో ‘బ్రదర్స్’ పేరుతో విడుదలైంది.

Suriya-Kajalఈ సినిమాలో సూర్య, కాజల్ మధ్య థియేటర్లో ఓ లిప్‌లాక్ షాట్ ఉంటుంది. అయితే అది నిజంగా పెట్టిన ముద్దు కాదని, ఆ షాట్ చేయడానికి సూర్య ఇబ్బందిగా ఫీల్ అవుతుండడంతో డైరెక్టర్ కాస్త వెరైటీగా థింక్ చేసి బ్లూ మ్యాట్ సాయంతో ముద్దు సన్నివేశాన్ని తీశారని చెప్పింది కాజల్. బ్లూ మ్యాట్‌లో సూర్యతో గ్లాస్‌(అద్దం)కి తర్వాత తనచేత ఓ బొమ్మకి ముద్దు పెట్టించి దాన్ని లిప్‌లాక్‌గా ఎడిట్ చేశారని చెప్పుకొచ్చింది. దీంతో హీరోయిన్‌గా 50కి పైగా సినిమాలు చేశావు.. అయినా ఏ హీరోతోనూ లిప్‌లాక్ చేయలేదా అంటూ కాజల్ నటించిన పలు సినిమాల్లోని ముద్దు ఫొటోలు జతచేసి మరీ ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. హిందీ చిత్రం ‘దో లఫ్జోంగీ కహాని’లో రణదీప్ హుడాతో కాజల్ రెచ్చిపోయి మరీ లిప్‌లాక్ చేసింది.
Suriya-Kajal

Related Tags :

Related Posts :