లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

కార్మికుల కోసం కదిలిన కుటుంబం..

తమిళ్ హీరోలు సూర్య, కార్తీ ఫ్యామిలీ The Film Employees Federation of South India (FEFSI) కు 10లక్షల విరాళం..

Published

on

Suriya and Karthi, along with father Sivakumar, donate Rs 10 Lakh for FEFSI members

తమిళ్ హీరోలు సూర్య, కార్తీ ఫ్యామిలీ The Film Employees Federation of South India (FEFSI) కు 10లక్షల విరాళం..

కరోనా వైరస్‌ ప్రభావంతో ఈ నెలాఖరు వరకు సినిమా షూటింగ్‌లు ఆపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. చలన చిత్ర పరిశ్రమ పెద్దలు కూడా మార్చి 31వరకు షూటింగ్‌లు ఆపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. చిత్ర పరిశ్రమలో వివిధ శాఖలలో పనిచేస్తున్న కార్మికులను ఆదుకోవడానికి పలువురు నటీనటులు ముందుకు వస్తున్నారు.

తమిళ సినీ కార్మికులకు అండగా నిలవడానికి సీనియర్ నటులు శివకుమార్, సూర్య, కార్తీ కుటుంబ సమేతంగా ముందుకు వచ్చారు. షూటింగ్స్ లేక రోజు గడవడం కష్టంగా వున్న కార్మికులకు తమవంతు సహాయంగా సూర్య, కార్తీలు  విరాళాన్ని ప్రకటించారు.

తమ కుటుంబం తరపున The Film Employees Federation of South India (FEFSI) కు 10లక్షల విరాళాన్ని ప్రకటించారు. సినిమానే జీవితంగా బతుకుతున్న వివిధ శాఖలలోని కార్మికులు ఇబ్బంది పడకూడదని తమవంతుగా ఈ చిన్న సహాయం చేస్తున్నామని సూర్య అన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *