రూ.లక్ష ఇవ్వు లేదా పొలం వదిలేయ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పొలం విషయంలో ఓ రైతు కొడుకును ఎస్సై చావబాదాడు. తన పొలం విషయంలో పాసు పుస్తకంలో మిస్టేక్స్ ఉన్నాయని రెవెన్యూ అధికారుల్ని అడిగిన పాపానికి పోలీస్ స్టేషన్ కు పిలిపించుకుని ఇష్టమొచ్చినట్లుగా చావగొట్టాడు. భూముల విషయంలో పోలీసులకు సంబంధం లేకపోయినా ఈ వివాదంలో సూర్యాపేట జిల్లా తిరుమల గిరి మండలం నాగారం ఎస్సై కలుగజేసుకుని రైతుకొడుు అశోక్ ను దారుణంగా కొట్టాడు. దీంతో పోలీసుల నుంచి తప్పించుకున్న అశోక్ ఎస్సీకి ఫిర్యాదు చేశాడు.తెలంగాణాలో ప్రజల సేవల కోసమే పోలీసులు అంటే ప్రజలు సేవ చేసేవారనీ..రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలిసింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్. కానీ కొంతమంది పోలీసులు సామాన్య ప్రజలపై అధికారంతో దౌర్జాన్యాలకు దిగుతు ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను దెబ్బతీస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందని స్టేషన్ కు వెళ్లినా అంగబలం, అర్ధబలం వారివైపే చట్టం మొగ్గుచూపుతోంది. సివిల్ కేసులలో తలదూర్చే అధికారం పోలీసులకు లేకున్నా తాము చెప్పిందే వినాలంటూ జోక్యం చేసుకొని లాలూచీ రాజకీయాలు చేస్తున్నారు.

ఇలాంటి ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జరిగింది. ఓర్సు మల్లయ్య అనే రైతుకు నగరం మండలం ఈటూరు గ్రామ శివారులో సర్వే నంబర్ 585 A/1/2 లో ఇరవై కుంటల వ్యవసాయ భూమి, 586 A/1/2 మూడెకరాల 20 కుంటల భూమి ఉంది. గతంలో ఈ భూమికి పట్టాదారు పాసు బుక్కులు ఇచ్చారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత పాసు పుస్తకాలు రద్దు చేసి కొత్త వాటిని జారీ చేసారు.ఈ క్రమంలో ప్రభుత్వం జారీ చేసిన నూతన పట్టాదారు పాసు పుస్తకంలో సర్వే నెంబర్ 586 లో మూడెకరాల 20 కుంటలు సర్వే నెంబర్ 585 లో ఇరవై కుంటల భూమి ఉన్నట్లు చెబుతోంది. మల్లయ్య మొత్తం నాలుగు ఎకరాల భూమి ఉండగా సర్వే నంబర్లను మార్చి నాలుగు ఎకరాల 20 కుంటల భూమి ఉన్నట్టు పాసు పుస్తకం అందజేశారు. ఇందులో అదనంగా నమోదైన 20 కుంటల భూమిని రద్దు చేయడం తోపాటు సర్వే నంబర్లలో తప్పులు ఉన్నాయి. వీటిని గుర్తించిన ఓర్సు మల్లయ్య కొడుకు తప్పులను సరిచేయాలని కోరుతూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.

పాస్ పుస్తకంలో తప్పులు సరిచేయాలంటూ తన కుమారుడు అశోక్ తో కలిసి ఏడాదిగా అధికారుల చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోయింది. ఇదే అదనుగా భావించి మల్లయ్యకు తెలిసిన వ్యక్తి సోమయ్య ఆ భూమిని కబ్జా చేశాడు. దీంతో భూమి కోసం వీరికి కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. మల్లయ్య ఆ భూమి తనదేనంటూ అందులో కంది పైరు వేశాడు. దాన్ని సోమయ్య ధ్వంసం చేశాడు. ఈ ఘటనలో రెండు కుటుంబాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆగస్టు నాల్గవ తేదీన మళ్ళీ గొడవ జరగగా మల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఆ తరువాత సోమయ్య కూడా పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై లింగం.. మల్లయ్య కుమారుడు అశోక్ ను స్టేషన్ కు పిలిపించాడు. తాను చెప్పినట్లు వినకపోతే చంపుతానని బెదిరించాడని అశోక్ అంటున్నాడు. తనకు లక్ష రూపాయలు ఇస్తే న్యాయం చేస్తా లేకపోతే లక్ష తీసుకొని భూమి వదులుకోమని ఎస్సై అన్నాడని తెలిపాడు, మాట వినకపోవడంతో సెల్ లో వేసి తనను తీవ్రంగా లాఠీలతో కొట్టారని అశోక్ ఆరోపిస్తున్నారు.Si దౌర్జన్యంపై ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.


Related Posts