సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియాపై 9 ఆరోపణలు ఇవే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు సంబంధించి సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు రియా చక్రవర్తితో పాటు మరో ఐదుగురిపై పాట్నా పోలీసులు కేసు నమోదు చేశారు. సుశాంత్ ఆత్మహత్యకు రియా సాయం చేసిందని, తన కొడుకు చనిపోవడానికి రియానే కారణమని ఫిర్యాదు చేసినట్లు పట్నా సెంట్ర్ జోన్ ఇన్స్ పెక్టర్ సంజయ్ సింగ్ వెల్లడించారు.కేకే సింగ్ ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఆమెపై 9ఆరోపణలు పేర్కొన్నారు. రియాతో పాటు మరో ఐదుగురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు వెల్లడించారు.

ఆరోపణ 1. మెడికల్ రిపోర్ట్స్ బయటపెడతానని బెదిరించింది
ఆరోపణ 2. సుశాంత్‌ను ఇంటికి తీసుకెళ్లి మత్తులో ముంచెత్తింది
ఆరోపణ 3. తనకూ అవకాశం ఇచ్చినప్పుడే సుశాంత్‌తో సినిమాలకు సైన్ చేయించేది
ఆరోపణ 4. మెడికల్ రిపోర్ట్స్, ల్యాప్‌టాప్, జ్యువెల్లరీ, నగదు తీసుకెళ్లిన రియా
ఆరోపణ 5. సుశాంత్‌కు రియా తన కుటుంబాన్ని చూపించలేదు
ఆరోపణ 6.. సుశాంత్ కూగ్‌కు వెళ్లాలని కోరుకున్నా.. రియా నిరాకరించింది
ఆరోపణ 7. సుశాంత్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.15కోట్లు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి
ఆరోపణ 8.. సుశాంత్ నమ్మిన సిబ్బందిని రియా తొలగించింది
ఆరోపణ 9. రియా సుశాంత్ ఫోన్‌ నెంబర్‌ను బ్లాక్ చేసిందిజూన్ 14 సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహ్యత్య.
జూన్ 20 సుశాంత్ కుటుంబసభ్యులతో సహా 14మంది వ్యక్తుల సాక్ష్యం రికార్డు.
జూన్ 27 యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌లోని ఇద్దరు మాజీ ఉద్యోగులకు వైఆర్ఎఫ్‌తో సుశాంత్ ఒప్పందం గురించి ప్రశ్నలు.జులై 8 సంజయ్ లీలా భన్సాలీ వాంగ్మూలం రికార్డు.
జులై 9 పోలీసులకు వాంగ్మూలాన్ని ఇ-మెయిల్ చేసిన శేఖర్ కపూర్
జులై 18 వైఆర్‌ఎఫ్ ఛైర్మన్ ఆదిత్య చోప్రా వాంగ్మూలం రికార్డు
జులై 22 సినీ విమర్శకుడు రాజీవ్ మసాండ్‌ను ప్రశ్నించడానికి పిలుపు
జులై 28 సుశాంత్ తండ్రి ఫిర్యాదుతో రియా చక్రవర్తిపై కేసు

Related Posts