లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

హ్యాపీ బర్త్‌డే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

Published

on

Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. జనవరి 21 న సుశాంత్ పుట్టినరోజు.. అన్నీ తను అనుకున్నట్లు జరిగి ఉంటే.. ఇవాళ కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య తన 35 వ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేవాడు.. విధి విచిత్రమైంది కదా.. తనకా అవకాశం లేకుండా చేసింది. 34 ఏళ్లకే నూరేళ్ల ఆయుష్షు నిండిపోయిందంటూ మృత్యువు తీసుకెళ్లిపోయింది.

Sushant Singh Rajput

సుశాంత్ 1986 జనవరి 21 న పుట్టిన సుశాంత్ 2008 లో టీవీ నటుడిగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. 2013 లో కోటి కలలతో హిందీ చిత్రసీమలోకి అడుగు పెట్టాడు. ‘కై పో చే’, ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘పీకే’, ‘ఎం.ఎస్. ధోని : ద అన్‌టోల్డ్ స్టోరీ’, ‘రాబ్తా’, ‘కేదార్ నాథ్’, ‘చిచ్చోరే’, ‘దిల్ బెచారా’ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మంచి టాలెంట్, ఎంతో చక్కని భవిష్యత్తు ఉంది.. పెద్ద స్టార్ అవుతాడు అనుకున్నారంతా.. కానీ తెరవెనుక రంగుల ప్రపంచం తననెలా ట్రీట్ చేస్తోందనే నిజం తనకు మాత్రమే తెలుసు..

Sushant Singh Rajput

రీల్ లైఫ్ హీరో రియల్ లైఫ్‌లో ఎందుకో హీరో కాలేకపోయాడు.. మౌనాన్ని ఆశ్రయించాడు.. ధైర్యాన్ని కోల్పోయాడు.. ఊహించని విధంగా 2020 జూన్ 14 న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.. సుశాంత్ ఎక్కడున్నా తను పోషించిన పాత్రల రూపంలో ప్రేక్షకుల మనసుల్లో పదికాలాల పాటు పదిలంగా ఉంటాడు.. హ్యాపీ బర్త్‌డే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్..