Sushant Singh Rajput suicide: Case filed against Salman Khan, Karan Johar and others in Bihar Court

సుశాంత్ మరణం.. సల్మాన్, కరణ్ సహా మరో ఆరుగురిపై కేసు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య-ఎనిమిది మంది బాలీవుడ్ ప్రముఖులపై కేసు నమోదు..

బాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య గురించే చర్చ జరుగుతోంది. అంతులేని ప్రతిభ ఉన్నా పరిశ్రమలో పెద్దలుగా చలామణీ అవుతన్న వారి చేత అణచివేతకు గురికావడంతోనే అతను ఆవేదనకు లోనై ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ ఇండస్ట్రీ ప్రముఖులే బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా సుశాంత్ ఆత్మహత్యకు వీరే కారణమంటూ ఎనిమిదిమంది బాలీవుడ్ ప్రముఖులపై కేసు నమోదైంది.
ఎనిమిది మంది బాలీవుడ్ ప్రముఖులు సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకునేలా పురికొల్పారంటూ బిహార్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది సుధీర్ కుమార్ ఓఝా బీహార్‌లోని ముజప్ఫర్‌పూర్‌లో బుధవారం ఉదయం న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ఇందులో సల్మాన్ ఖాన్, ప్రముఖ దర్శక నిర్మాతలు కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ, హిందీ టీవీ సీరియళ్ల నిర్మాత, బాలాజీ టెలిఫిల్మ్స్ చీఫ్ ఏక్తా కపూర్ సహా మరో నలుగురి పేర్లను ఆయన ఈ పిటీషన్‌లో చేర్చారు.

ఈ ఎనిమిది మంది సుశాంత్ మాన‌సికంగా కుంగిపోయేలా చేసి ఆత్మ‌హ‌త్య‌కి పాల్ప‌డేలా చేశార‌ని పిటీష‌న్‌లో పేర్కొన్నారు. వీరిపై 306, 109, 504, 506 సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు సుధీర్ కుమార్ ఓఝా. ధర్మ ప్రొడక్షన్స్, యశ్ రాజ్ ఫిల్మ్స్, సాజిద్ నడియాడ్ వాలా, టి-సిరీస్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, దినేష్ విజన్, బాలాజీ టెలిఫిల్మ్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థలు సుశాంత్‌ను పక్కన పెట్టేయడమే కాకుండా అతనికి వచ్చిన అవకాశాలను కూడా దూరం చేశాయని, దీంతో అతను టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్‌లు చేస్తున్నాడని 2020 ఫిబ్రవరి 27న చేసిన ట్వీట్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. 

Read: సుశాంత్ అభిమాని ఆత్మహత్య

Related Posts