Sushant Singh Rajput’s మైనపు విగ్రహం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Sushant Singh Rajput’s wax statue : దివంగత బాలీవుడ్ యంగ్ హీరో..నటుడు సుశాంత్ సింగ్ మైనపు విగ్రహం తయారైంది. వెస్ట్ బెంగాల్ లోని అసాంసోల్ కు చెందిన కళాకారుడు సుకాంతో రాయ్ మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. తన మ్యూజియంలో సెలబ్రెటీల మైనపు విగ్రహాల జాబితాలో పెట్టాడు.

విగ్రహం పక్కన నిలబడిన ఫోటో వైరల్ అవుతోంది. వైట్ కలర్ టీషర్టు, బ్లూ కలర్ జాకెట్ ధరించి ఉన్న ఈ విగ్రహం అభిమానులను అలరిస్తోంది. భావోద్వేగంతో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే సుకాంతో అమితాబ్ బచ్చన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాలు తయారు చేసి మ్యూజియంలో ఉంచారు.సుశాంత్ అంటే తనకు అభిమానమని, ఎంతో ఇష్టమన్నారు సుకాంతో. కానీ సుశాంత్ చనిపోవడం బాధగా ఉందన్నారు. అతని జ్ఞాపకార్థం ఈ విగ్రహం రూపొందించానని చెప్పారు.

Drugs case Bollywood : నవదీప్ స్ట్రాంగ్ కౌంటర్..


సుశాంత్ సింగ్ జూన్ 14న చనిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. ముంబైలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు.కొన్ని నెలలుగా సుశాంత్‌ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త బాలీవుడ్‌ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఈ యువహీరో ఇక లేరనే చేదు వార్తను బాలీవుడ్‌ ఇండస్ట్రీ దింగమింగుకోలేకపోయింది. ఆ తర్వాత సుశాంత్ కేసు అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య అనే ఆరోపణాలు ఎక్కువయ్యాయి.సీబీఐకి అప్పగిస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం తెలపగా.. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సుశాంత్‌ మృతి కేసుపై సీబీఐ విచారణకు బీహార్‌ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కేంద్రం అంగీకరించింది. సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు బీహార్ సీఎం సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు.

సుశాంత్‌ ఆత్మహత్యకు పాల్పడలేదని, హత్యకు గురయ్యారంటూ పలువురు రాజకీయ ప్రముఖులు సైతం ఆరోపిస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న నెల రోజుల తర్వాత ఆయన తండ్రి కేకే సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె కుటుంబం తన కొడుకుని మోసం చేసిందని, ఆర్ధికంగా, మానసికంగా వేధించారని ఆయన ఆరోపించారు.ఈ క్రమంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ప్రియురాలు రియా చక్రవర్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) మంగళవారం అరెస్ట్ చేసింది.

డ్రగ్స్ మాఫియాతో రియాకు సంబంధాలున్నట్లు గుర్తించిన ఎన్‌సీబీ ఆమెను అదుపులోకి తీసుకుంది. కాగా, సుశాంత్‌ సింగ్‌ మృతి చెందిన్నప్పటి నుంచి పోలీసులు రియాను విచారిస్తున్నారు. దీనిలో భాగంగానే డ్రగ్స్‌ కేసు వెలుగులోకి వచ్చింది.తాను మాత్రం డ్రగ్స్ వినియోగించలేదని, కేవలం సుశాంత్ కోసమే కొనుగోలు చేశానని రియా చెప్పుకొచ్చింది. విచారణలో ఆమె బాలీవుడ్‌లో డ్రగ్స్ మత్తులో మునిగి తేలే 25 మంది ప్రముఖుల పేర్లు కూడా వెల్లడించింది.రియా సోదరుడు షోవిక్ చక్రవర్తిని కూడా ఎన్‌సీబీ అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. రియా సూచనల మేరకు సుశాంత్‌ డ్రగ్స్‌ తీసుకునేవాడని షోవిక్‌ విచారణలో వెల్లడించాడు.

READ  రజనీకాంత్ సర్‌లా యాక్ట్ చేయాలనుకుంటున్నా.. సుశాంత్ సింగ్ డైలాగ్

Related Posts