సుశాంత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో?.. ఫ్రెండ్ సిద్ధార్థ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మనీ లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేయనుంది. సుశాంత్ ఖాతాలోని రూ.15 కోట్ల అనుమానాస్పద లావాదేవీలపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి బ్యాంక్ ఖాతాలను పరిశీలించనుంది. గత 90 రోజుల్లో సుశాంత్ బ్యాంక్ బ్యాలెన్స్ రూ.4.64 కోట్ల నుంచి 1.04 కోట్ల రూపాయలకు తగ్గింది. సుశాంత్ ఖాతానుంచి డబ్బులు ఎలా మాయమయ్యాయి, ఎవరు వాడుకున్నారన్నదానిపై ఈడీ విచారణ జరుపనుంది. రియా చక్రవర్తి తన ఖర్చుల కోసం ఈ డబ్బు తన కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి ట్రాన్స్‌‌ఫర్ చేసినట్లు తెలుస్తోంది.14 అక్టోబర్ 2019 వరకు సుశాంత్ ఖాతాలో రూ.4 కోట్లకు పైగా డబ్బులుండేవి. అదే రోజు రియా చక్రవర్తి తన సోదరుడి విమాన టికెట్ కోసం 81,901 రూపాయలు షోవిక్ ఖాతాలోకి ట్రాన్స్‌‌ఫర్ చేశారు. అంతేకాదు ఆ మరుసటిరోజు షోవిక్ హోటల్ ఖర్చులకోసం 4.07లక్షల రూపాయలు, ఢిల్లీలోని తాజ్ హోటల్‌లో ఉండడం కోసం 4.03 లక్షల రూపాయలను ట్రాన్స్‌ఫర్ చేశారు రియా. అక్టోబర్ 16న షోవిక్ విమాన టికెట్ కోసం మరో 76 వేలు ట్రాన్స్‌ఫర్ చేశారు. వీటన్నింటిపై ఈడీ దర్యాప్తు చేయనుంది.

రియా, సుశాంత్ ఖాతానుంచి విచ్చలవిడిగా డబ్బును వాడుకుంది. మేకప్, దుస్తులు, పార్లర్, ట్రావెల్ వంటి వాటికోసం బోలెడంత డబ్బు ఖర్చు చేసింది. రియా తమ్ముడు షోవిక్ ట్యూషన్ ఫీజు కూడా సుశాంతే పే చేశాడు. సుశాంత్ ఖాతాలో రూ.17 కోట్లు ఉన్నట్లు బ్యాంక్ స్టేట్‌మెంట్ ద్వారా తెలిసిందని సుశాంత్ తండ్రి కేకే సింగ్ అన్నారు. అతని ఖాతానుంచి గతేడాది రూ. 15 కోట్లు డ్రా చేసినట్లు, రియా చక్రవర్తి ఈ డబ్బు తీసినట్లు కేకు సింగ్ బీహార్‌లో కేసు నమోదు చేశారు. డబ్బు కాజేసేందుకే తన కుమారుణ్ణి ఆత్మహత్యకు పురిగొల్పిందని సుశాంత్ తండ్రి ఆరోపించడంతో బీహార్ పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.ఇండస్ట్రీలో ఆఫర్లు, బెదిరింపులపై సుశాంత్ ఎప్పుడూ తనతో చర్చించలేదని సుశాంత్ ఫ్రెండ్ సిద్ధార్థ్. సోషల్ మీడియాలో సుశాంత్ మరణంపై లేనిపోని ఆరోపణలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన సిద్ధార్థ్.. తన స్నేహితుడిది ఆత్మహత్యా, హత్యా అనేది పోలీసులే నిర్ధారించాలన్నాడు. విచారణకు పోలీసులు ఎప్పుడు పిలిచినా సహకరిస్తానంటూ 10టీవీతో మాట్లాడాడు.

సుశాంత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే సందేహం తనకు కూడా ఉందని, ముంబై, బీహార్, సుప్రీంకోర్ట్ అందరినీ ఇన్వెస్టిగేట్ చేసి ఆన్సర్ ఇస్తారనే కాన్ఫిడెండ్‌గా ఉన్నామని తెలిపాడు. ఆత్మహత్య చేసుకునే ముందు రోజు తనతో, ఫ్రెండ్స్‌తో, స్టాఫ్‌తో మాట్లాడి పైకి వెళ్లాడని, 14వ తేది ఉదయం స్టాఫ్ సార్ డోర్ తీయడంలేదని చెప్పారని చెప్పాడు. ముందురోజు రాత్రి తనతో ఆప్యాయంగా మాట్లాడాడని, అప్పుడు తనకు కాల్స్, బెదిరింపులు లాంటివి వచ్చాయో లేదో తనకు తెలియదు అన్నాడు.సుశాంత్ దగ్గర రియా డబ్బు తీసుకున్న విషయం ఇన్వెస్టిగేషన్‌లో తెలుస్తుందని అన్నాడు. సోషల్ మీడియాలో రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. కాల్స్ చేస్తున్నారు, మెసేజులు చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారు. దయచేసి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి, మేం మా బ్రదర్‌ని కోల్పోయిన బాధలో ఉన్నాం. జస్టిస్ కోసం ఎదురుచూస్తున్నాం అని తెలిపాడు సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్.

READ  మంత్రిగా వేముల ప్రశాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంRelated Posts