సుశాంత్ కేసులో మరో ట్విస్టు..ఆయన ఉదయం 4 గంటల వరకు నిద్రపోడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బాలీవుడ్ లో ఎంతో కెరీర్ ఉన్న సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఇంకా మిస్టరీ వీడడం లేదు. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర ఆదేశాలతో సీబీఐ విచారణ చేపడుతోంది. పలువురిని విచారణ చేపడుతోంది కూడా.

కానీ..సుశాంత్ సింగ్ నివాసం ఉంటున్న బిల్డింగ్ లో ఉన్న ఓ వ్యక్తి చెప్పిన అంశాలు కీలకంగా మారాయి. ఓ లాకల్ ఛానెల్ తో అతను మాట్లాడాడు. జూన్ 13వ తేదీ (సుశాంత్ ఆత్మహత్య కంటే ముందు రోజు)..రాత్రి సుశాంత్ ఇంట్లో 10.30 – 10.45 గంటలకే లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయన్నాడు.

కానీ కిచెన్ లో మాత్రం బల్బులు వెలుగుతున్నాయని తెలిపాడు. అయితే..ఎప్పుడూ అంత తొందరగా లైట్లు సుశాంత్ ఆపే వ్యక్తి కాదని, తెల్లవారుజామున 4 గంటల వరకు మేల్కోనే ఉంటాడని వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సుశాంత్ ఆత్మహత్యపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. సేకరించిన ఆధారాలను, కేసు పత్రాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను కోర్టు ఆదేశించింది. అలాగే సీబీఐకి సహకరించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.

సుశాంత్ సింగ్ మృతిపై కుటుంబసభ్యులు పలు అనునామాలు వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య అని ఆరోపిస్తున్నారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.

సీబీఐకి అప్పగిస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం తెలపగా.. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సుశాంత్‌ మృతి కేసుపై సీబీఐ విచారణకు బీహార్‌ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కేంద్రం అంగీకరించింది. సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు బీహార్ సీఎం సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు.

సుశాంత్‌ ఆత్మహత్యకు పాల్పడలేదని, హత్యకు గురయ్యారంటూ పలువురు రాజకీయ ప్రముఖులు సైతం ఆరోపిస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న నెల రోజుల తర్వాత ఆయన తండ్రి కేకే సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె కుటుంబం తన కొడుకుని మోసం చేసిందని, ఆర్ధికంగా, మానసికంగా వేధించారని ఆయన ఆరోపించారు.

సుశాంత్ సింగ్ జూన్ 14న చనిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. ముంబైలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. కొన్ని నెలలుగా సుశాంత్‌ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త బాలీవుడ్‌ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ యువహీరో ఇక లేరనే చేదు వార్తను బాలీవుడ్‌ ఇండస్ట్రీ దింగమింగుకోలేకపోయింది. ఆ తర్వాత సుశాంత్ కేసు అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య అనే ఆరోపణాలు ఎక్కువయ్యాయి.

Related Tags :

Related Posts :