లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

సుషాంత్ లాంటి వ్యక్తే దొరికేశాడు.. మర్డర్ లేదా సూసైడ్ ఇదే టైటిల్‌తో సినిమా

Published

on

TikTok స్టార్ సచిన్ తివారీ.. త్వరలో రానున్న సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ కథతో తీసే సినిమాలో లీడ్ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమా పేరు కూడా అతని జీవితం ముగింపులాగే ఉంది. సూసైడ్ లేదా మర్డర్: ఓ స్టార్ వెళ్లిపోయాడు అని నిర్మాత విజయ్ శేఖర్ గుప్తా ప్రకటించారు. మేకర్స్ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా పోస్టర్ రూపంలో విడుదల చేశారు. ద అవుట్ సైడర్ గా సచిన్ తివారీ నటించనున్నట్లు, శామిక్ మాలిక్ డైరక్షన్ చేస్తున్నట్లుగా ప్రకటించారు.

ఈ ఫస్ట్ లుక్ ను ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఓటీటీ ప్లాట్‌ఫాం వీఎస్జీ బింగే పేజిలో పోస్ట్ చేశారు. దానికి క్యాప్షన్ కింద ‘చిన్న పట్టణం నుంచి వచ్చిన వ్యక్తి ఫిల్మ్ ఇండస్ట్రీలో షైనింగ్ స్టార్ గా ఎలా ఎదిగాడు. అనేదే ఇతని కథ. సచిన్ తివారీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ద అవుట్ సైడర్ పాత్రలో నటిస్తున్నాడు. సూసైడ్ ఆర్ మర్డర్ అనే టైటిల్ తో సినిమా తీస్తున్నారు. విజయ్ శేఖర్ నిర్మాతగా, శామిక్ మాలిక్ డైరక్షన్, శ్రద్ధా పండిట్ సంగీత బాధ్యతలు చూసుకుంటున్నారు.

గతంలోనే సచిన్ తివారీ సోషల్ మీడియాలో ఫ్యామస్. సుషాంత్ ను పోలి ఉండటంతో అతనికి ఫాలోవర్లు బాగానే సంపాదించుకున్నాడు. ‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం అందరం షాక్ అయ్యాం. ఇదేం కొత్త కాదు. చాలా మంది యాక్టర్లు చాలా పెద్ద కలల్ని నిజం చేసుకోవాలనుకుని ఫెయిల్ అవుతుంటారు. ఎక్కువమంది ఈ నిర్ణయమే తీసుకుంటారు. మరికొందరు పోరాడుతూనే ఉంటారు’

‘చిన్న పట్టణాల నుంచి వచ్చి బ్యాక్ గ్రౌండ్ లేకుండా బాలీవుడ్ లో ఎలా లీడ్ చేస్తారనేది చూపించాలనుకుంటున్నాం. మిగతా క్యారెక్టర్లను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తాం. ఈ సినిమా బాలీవుడ్ లో ఉన్న వారి మాస్క్ లు తీసేసి నిజం చూపిస్తుందని మాటిస్తున్నాను’ అని డైరక్టర్ చెప్పారు. సుషాంత్ మరణం తర్వాత సినిమాను ప్రకటించిన యూనిట్ ఇది బయోపిక్ కాదని చెప్పింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *