కరోనా పరీక్షల కోసం పడిగాపులు…12 గంటలైనా పట్టించుకోని అధికారులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కాకినాడ జీజీహెచ్ లో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కరోనా పరీక్షల కోసం అనుమానితులు పడిగాపులు పడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఎదురుచూస్తున్నా అధికారులెవరూ పట్టించుకోలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా వాసుల్లో ఆందోళన నెలకొంది.

ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలు చేయించుకోవడానికి పెద్ద ఎత్తున స్థానికులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సంచార సంజీవిని బస్సు ఏర్పాటు చేసింది. ఈ బస్సు వివిధ ప్రాంతాలు తిరిగి కోవిడ్ టెస్టులు నిర్వహిస్తోంది. ఇవాళ సంచార సంజీవిని బస్సు కాకినాడ జీజీహెచ్ వద్ద ఉందన్న సమాచారం అందుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

ఉదయం 7 గంటల నుంచి వారంతా టెస్టులు చేయించుకునేందుకు క్యూలైన్ లో నిరీక్షించారు. అయితే డాక్టర్లు రాలేదన్న నెపంతో అక్కడి సిబ్బంది గంట గంటకు కాలయాపన చేసింది. రాత్రి 7 గంటలు దాటిన తర్వాత కూడా ఇంకా డాక్టర్లు రాలేదని చెబుతున్నారు. అసలు టెస్టులు నిర్వహిస్తారా లేదా అనేదానిపై స్థానికులు క్లారిటీ ఇవ్వకపోవడం చంటిపిల్లలు సహా ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు.

రాత్రి 8 అయినా టెస్టులు నిర్వహించకపోవడంతో ఏం చేయాలో తెలియక అక్కడ పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు, జీజీహెచ్ సిబ్బంది టెస్టులు నిర్వహిస్తారా లేదా నిర్వహిస్తే ఎన్నిగంటలకు నిర్వహిస్తారు? పూర్తి సమాచారం వారికి ఇవ్వకపోవడంతో ఇంకా నిరీక్షిస్తున్నారు.

Related Tags :

Related Posts :