లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Hyderabad

ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెపై సస్పెన్స్ 

ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. చర్చలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవడంతో ఆర్టీసీ జేఏసీ భవిష్యత్‌ కార్యాచరణపై ఫోకస్‌ చేసింది.

Published

on

Suspence on strike of RTC trade unions

ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. చర్చలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవడంతో ఆర్టీసీ జేఏసీ భవిష్యత్‌ కార్యాచరణపై ఫోకస్‌ చేసింది.

ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. చర్చలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవడంతో ఆర్టీసీ జేఏసీ భవిష్యత్‌ కార్యాచరణపై ఫోకస్‌ చేసింది. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజకీయ జేఏసీ, ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఇప్పటివరకూ సమ్మె ఎలా జరిగింది? ఇకపై ఎలా జరగాలన్నదానిపై చర్చిస్తున్నారు. కొత్త కార్యాచరణ రెడీ చేసుకోనున్నారు. అయితే… ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. కానీ ప్రభుత్వం నుంచీ అలాంటి సంకేతాలేవీ కనిపించట్లేదు.

మరోవైపు ఆర్టీసీ జేఏసీతో చర్చలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ లేదు. బంద్ సందర్భంగా జరిగిన అరెస్టులు, రాసిన కేసుల్ని బట్టి… ప్రభుత్వం కఠినంగానే ఉండాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. ఒకవేళ కార్మిక సంఘాల్ని చర్చలకు పిలవాలనుకున్నా… హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఆర్టీసీ సమ్మె 16వ రోజుకు చేరింది. తమ సమ్మెకు మద్దతు కూడగట్టుకోవడంలో భాగంగా ఇవాళ అన్ని కూడళ్ల దగ్గర ప్రజలకు పువ్వులివ్వనున్నారు. బంద్ సందర్భంగా గాయపడ్డ పోటు రంగారావుని ఆర్టీసీ జేఏసీ నేతలు కలిసి పరామర్శిస్తారు.. ఈనెల 23న ఓయూలో విద్యార్థులతో సమావేశం కావాలనే ఆలోచనలో ఉన్న జేఏసీ నేతలు…ఆ తర్వాత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నారు.
 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *