SVBC Chairman Prudhvi Raj Call Recording With Employee

మహిళా ఉద్యోగితో ఫోన్‌లో సరసాలు: అడ్డంగా బుక్కైన ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోతున్నారు ఎస్వీబీసీ చైర్మన్, “30 ఇయర్స్ ఇండస్ట్రీ” పృథ్వీ. ఇటీవల రైతుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పృథ్వీ పోసాని వంటి సినీనటులు, రాజకీయ పార్టీల నాయకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ ఎస్వీబీసీ చైర్మన్ హోదాలో సహోద్యోగినితో రాసలీలలు జరిపిన పృథ్వీ ఆడియో టేప్ ఇప్పుడు రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ సంచలనంగా మారింది. సహోద్యోగినితో సరస సంభాషణ జరుపుతూ అడ్డంగా బుక్ అయ్యారు పృథ్వీ.

మహిళా ఉద్యోగినితో మాట్లాడిన సంభాషణ: 

మహిళ: హెలో సార్..
పృథ్వీ: ఏంటమ్మా డిస్టర్బ్ చేశావ్. అదీ ఇదీ అంటున్నావ్?

మహిళ: పడుకున్నా అన్నాను సార్
పృథ్వీ: నోర్ముయ్.

పృథ్వీ: అన్నం తిన్నవా?
మహిళ: ఇప్పుడే తిని పడుకున్నా

పృథ్వీ : రేపు డ్యూటీ ఉందా?
మహిళ : రేపా? తెలీదు ఇంకా పొద్దున తెలుస్తుందేమో.

పృథ్వీ : నేను గుర్తుకురాలేదా?
మహిళ : ఎవరు

పృథ్వీ : నేను..
మహిళ : వచ్చారుగా. ఏం అలా అడిగారు. ఎందుకు?

పృథ్వీ : గుర్తుకొచ్చానా అంటున్నా?
మహిళ : మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు.

పృథ్వీ : ఇప్పుడు?
మహిళ : ఇప్పుడు కూడా.

పృథ్వీ : పడుకునేటప్పుడు?
మహిళ : సార్ నేను వర్షంలో తడుస్తూ వచ్చాను సార్ వచ్చేటప్పుడు.

పృథ్వీ : అవునా? చెప్పుంటే నేనే వచ్చి డ్రాప్ చేసేవాడినిగా?
మహిళ : మీ గెస్ట్ హౌస్ నుంచే వచ్చా నేను. పద్మావతి గెస్ట్ హౌస్ నుంచి.

పృథ్వీ : ఆగొచ్చు కదా?
మహిళ : అందరూ ఉన్నారుగా.

పృథ్వీ : నేను డ్రింక్ చేయట్లేదురా వన్ ఇయర్ నుంచి. మార్చి వరకు తాగను.
మహిళ : వాయిస్ అలా ఉంటే.. బాగా అలసి పోయారు కదా. డ్రింక్ చేశారేమో అనుకున్నా.

పృథ్వీ : డ్రింక్ చేయడం మొదలు పెడితే నీ దగ్గర కూర్చుని చేస్తా.
మహిళ : తప్పకుండా సార్.

పృథ్వీ : నీతో కూర్చుని కంపెనీ తీసుకుని చేస్తా.
మహిళ : అలాగే సార్. తప్పకుండా. ఏం చెప్పారు సార్ మీటింగ్‌లో?

పృథ్వీ : నువ్వు గుండెల్లో ఉన్నావ్.
మహిళ : భలే చెప్తారు ఆ మాట మీరు.

పృథ్వీ : నువ్వు గుండెల్లో ఉన్నావ్. హార్ట్ ఫుల్‌గా చెబుతున్నా.
మహిళ : అదే సార్. ఆ మాట చెబుతున్నప్పుడల్లా ఒక సంతోషం వెలిగిపోతుంది నాకు.

పృథ్వీ : నువ్వంటే అంతిష్టం ఎందుకొచ్చిందో తెలీదు.
మహిళ : ఎందుకు సార్. ఎందుకొచ్చింది. ఏదో ఒక కారణం ఉంటుంది కదా?

పృథ్వీ : దేవుడా.. నేను కామెడీ చేయడం లేదు.
మహిళ : నేను బయట చాలా సేపు నించున్నా. వస్తారేమో చూద్దామని

పృథ్వీ : వెనుక నుంచి వచ్చి పట్టుకుందామనుకున్నా. కెవ్వుమని అరుస్తావేమోనని భయపడి ఆగిపోయా.
మహిళ : ఎప్పుడు?

READ  ఫుల్ బిజీలో టాలీవుడ్.. టాప్ డైరక్టర్ల చేతి నిండా బడా హీరోల సినిమాలు

పృథ్వీ : మధ్యాహ్నం
మహిళ : ఎక్కడ నుంచి

పృథ్వీ : మీ రూమ్ దగ్గరికి వద్దామనుకున్నా
మహిళ : ఆ… వచ్చేశారా కిందకి?

పృథ్వీ : వద్దామనుకున్నా. గట్టిగా పట్టుకున్నాననుకో… ఒక్క అరుపు అరిస్తే ఏం చెప్పాలి నేను?
మహిళ : నేను అరవను కదా.

పృథ్వీ : ముందు అరుస్తావు కదా?
మహిళ : ఎందుకు అరుస్తాను? అరవను కదా. మీరేవరో నాకు తెలీదు… నాతో మాట్లాడట్లేదంటే అరుస్తా.

పృథ్వీ : సరే అయితే చెప్పు
మహిళ : ఏం చెప్పారు సార్ మీటంగ్‌లో అది చెప్పండి.

పృథ్వీ : చెబుతా 2 నిమిషాలు. కాఫీ తాగి చెబుతా.

కొంచెం సేపటి తర్వాత

పృథ్వీ : హలో ఓకే నీ ఇష్టం
మహిళ : సార్ అంత కోపంగా చెప్పకండి సార్. ప్లీజ్.

సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ మాటలకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వగా.. పృథ్వీని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. అయితే ఈ ఆడియోపై ఇప్పటివరకు పృథ్వీ స్పందించలేదు.

Related Posts