SVN జ్యూలరీ అధినేత శ్రీనివాసన్‌, ఫ్యామిలీకి తప్పిన ప్రమాదం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

SVN Jeweler Srinivasan : తమిళనాడుకు చెందిన SVN జ్యూయెలరీ అధినేత శ్రీనివాసన్‌‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో ఆయనతోపాటు శ్రీనివాసన్ కుటుంబానికి కూడా ప్రమాదం తప్పింది. శ్రీవారి దర్శనం కోసం శ్రీనివాసన్‌ తన కుటుంబంతో తిరుమలకు బయల్దేరారు. కోయంబత్తూరు నుంచి తిరుమలకు హెలీకాప్టర్ ద్వారా పయనమమయ్యారు.ఇంతలో కుప్పం సరిహద్దులో తిరుపత్తూరు జిల్లాలో పొగమంచు కమ్మేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ అక్కడే ఆగిపోయింది. కాసేపు గాల్లో చక్కర్లు కొట్టిన హెలీకాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. తిరుపత్తూరులోని నంగిలి వద్ద పంట పొలాల్లో హెలీకాప్టర్ క్షేమంగా ల్యాండ్ అయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.సమాచారం అందుకున్న తిరుపత్తూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం హెలీకాప్టర్ తిరుపతికి బయలుదేరింది. హెలీకాప్టర్‌లో ఇద్దరు పైలెట్లతో సహా ఏడుగురు ఉన్నారు. పొలాల్లో ల్యాండ్ అయిన హెలీకాప్టర్‌ను చూసేందుకు స్థానిక ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు.

Related Posts