అనంత తాడిపత్రి : త్రైత సిద్ధాంతకర్త స్వామి ప్రబోధానంద కన్నుమూత

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రబోధానంద అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా ప్రభోదానంద అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆశ్రమం నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రబోధానంద మృతి చెందారు. ప్రభోదానంద ఆత్మజ్ఞానం పేరుతో అనేక ప్రబోధానంద అనేక రచనలు చేశారు. గతంలో హిందూ, ముస్లిం దేవుళ్లపై ప్రబోధానం చేసిన వ్యాఖ్యలు పలు వివాదాలకుదారి తీశాయి.

కాగా..అనంతపురం నేత జేసీ వర్గీయులకు ప్రభోదానంద వర్గీయులకు వివాదాలు కొనసాగిన క్రమంలోతాడిపత్రి ఉద్రిక్తతగా మారింది. జేసీ వర్గీయులు, ప్రబోధానంద శిష్యుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ కారణంగా ఆయన ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. కాగా తాను చనిపోయే ముందే ప్రబోధానంద తన ఆశ్రమంలో సమాధి కట్టించుకోవటం విశేషం.

1950లో తాడిపత్రి మండలంలోని అమ్మలదిన్నె కొత్తపల్లె అనే గ్రామంలో ప్రభోదానంద జన్మించారు. ప్రభోదానంద అసలు పేరు పెద్దన్న చౌదరి. భారత సైన్యంలో వైర్ లెస్ ఆపరేటర్ గా కూడా ఆయన పని చేశారు. సైన్యం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాడిపత్రిలో కొన్ని రోజులు ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేశారు. డాక్టర్ గా పనిచేస్తూనే ఆయుర్వేదంపై పుస్తకం రాశారు.

ఇదే సమయంలో ఆధ్యాత్మిక అంశాలపై కూడా గ్రంథాలను రచించారు. అనంతరం ఆధ్యాత్మిక గురువుగా మారి..తాడిపత్రి సమీపంలోని చిన్నపొడమల గ్రామంలో శ్రీకృష్ణమందిరం పేరుతో ఆశ్రమాన్ని నిర్మించారు.

త్రైత సిద్ధాంతాన్ని బోధించే ప్రభోదానం భగవద్గీత, బైబిల్, ఖురాన్ లలో ఉన్న దైవజ్ఞానం ఒక్కటేననేదే ఆయన సిద్ధాంతం. ప్రబోధానంద మరణవార్తతో ఆయన భక్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇక ప్రబోధానంద అంత్యక్రియలు రేపు తాడిపత్రి సమీపంలోని ప్రబోధానంద ఆశ్రమంలో తన మరణానికి ముందే నిర్మించుకున్న సమాధిలోనే జరుతాయి.

Related Posts