Swara Bhasker trolled for abusing 4-year-old kid who called her aunty, complaint filed

నన్నే ఆంటీ అంటావా? : నాలుగేళ్ల చిన్నారిని బూతులు తిట్టిన నటి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మీరు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు మేడం,కొంచెం సృహతో మెలగండి అంటూ ఆమెపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. స్వరా ఆంటీ హ్యాష్ ట్యాగ్ తో ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. స్వరాభాస్కర్ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది. అంతేకాకుండా భారత్ లో ట్విట్టర్ లో నవంబర్-5,2019న ట్రెండింగ్ లో ఉన్నవాటిలో స్వరాభాస్కర్ హ్యాష్ ట్యాగ్ టాప్ లో ఉంది. అసలు ఇంతకీ ఆమె చేసిన తప్పు ఏంటో తెలిసుకోవాలనుకుంటున్నారా!

సోషల్ మీడియాలోవైరల్ అవుతున్న ఓ వీడియో క్లిప్ లో స్వరాభాస్కర్ తనను ఆంటీ అని పిలిచిన నాలుగేళ్ల బాల నటుడిని చూతియా అని తిట్టింది. సర్వాభాస్కర్ తన సినీ కెరీర్ ప్రారంభంలో ఆ బాల నటుడితో కలిసి ఓ అడ్వర్టైజ్మెంట్ షూట్ లో పాల్గొన్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో కార్చిచ్చులా వ్యాపిస్తోంది. ఆ బాలనటుడు తనను ఆంటీ అని పిలవడంతో తనకు చాలా కోపం వచ్చిందని,తాను చాలా నిరుత్సాహపడ్డానని ఆ వీడియోక్లిప్ లో స్వరాభాస్కర్ తెలిపింది.

అయితే వైరల్ వీడియోపై స్పందించిన స్వరాభాస్కర్ తాను బాలనటుడి మొఖం మీద చుతియా అని తిట్టలేదని,తాను మనసులో అనుకున్నానని తెలిపింది. చిన్న పిల్లలు సాధారణంగా చెడుగా ఉంటారని ఆమె తెలిపింది. స్వరాభాస్కర్ చిన్నారిని తిట్టడంపై లీగల్ రైట్స్ ఫోరం అనే ఓ ఎన్జీవో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కి కంప్లెయింట్ చేసింది.

Related Posts