swaroopanandendra swamy response ttd lands

నాన్చొద్దు..త్వరగా తేల్చండి : టీటీడీ భూముల వేలంపై స్వరూపానంద ఏమన్నారంటే..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

టీటీడీ భూముల విక్రయంపై  స్పందించిన స్వామీ స్వరూపానందేంద్రస్వామి తిరుమల తిరువతి దేవస్థానం భూముల్ని వేలం వేసే వార్తలపై శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి స్పదించారు. ఏపీ ప్రభుత్వానికి..టీటీడీకి కూడా  స్వామి స్వరూపానందేంద్ర పలు సూచనలు చేశారు.  

టీటీడీ భూముల వ్యవహారంలో వివాదాలకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకోవానీ..టీటీడీ తీసుకునే ప్రతీనిర్ణయం కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలను ముడి ఉందనే విషయం ఏమాత్రం మరచిపోవద్దంటూ స్వరూపానంద సూచించారు. టీటీడీ భూములను విక్రయించే విషయంలో భక్తుల మనోభావాలను గౌరవించాలన్నారు.  ఈ విషయాన్ని ఎక్కువ కాలం నాన్చకుండా వెంటనే తేల్చాలని..భక్తులకు క్లారిటీ ఇవ్వాలని సూచించారు.  

మిళనాడులోని ఆస్తులను విక్రయించేందుకు వేలం వేయాలని టీటీడీ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.తమిళనాడులోని కాంచీపురం, వేలూరు, కోయబంత్తూరు, విల్లుపురం, నాగపట్నం, తిరువణ్నామలై తదితర జిల్లాల్లో ఉన్నాయి. వీటి వేలానికి  టీటీడీమే 30వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై భారీగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. వెంకటేశ్వర స్వామి విషయం, టిటిడి ఇష్టం కాదని, భక్తుల మనోభావం దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.   

Related Tags :

Related Posts :