swathi-deekshith-wild-card-entry-in-to-bigboss-4

బిగ్‌బాస్‌లోకి స్వాతి దీక్షిత్ కన్ఫామ్.. ఈ వారమే ఎంట్రీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బిగ్‌బాస్ షోలో మరో కీలకమార్పు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వనుంది. ముందుగా వినిపించిన ఊహాగానాలు నిజమయ్యే తరుణం ఆసన్నమైందని లీకువీరులు చెబుతున్నారు. ఓ వైపు ఐపీఎల్ జరుగుతున్నా క్రేజ్ తగ్గించుకోకుండా దూసుకుపోతున్న బిగ్‌బాస్ మరింత ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు రెడీ అయింది.




గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రెండు వారాల్లోనే రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చేసింది. ముచ్చ‌ట‌గా మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి జంప్ జిలానీ సినిమా హీరోయిన్‌ స్వాతి దీక్షిత్ ను బిగ్ బాస్-4వ సీజన్ లోకి వెల్కమ్ చెప్పనుంది.



చిచ్చుపెట్టడం, చెదరగొట్టడం బిగ్ బాస్ స్టైల్. వీటి కోసమే సపరేట్ టాస్క్ లు ప్లాన్ చేస్తారు. ఇప్పుడు వచ్చే కొత్త హీరోయిన్ తో షోలో వేడెక్కించడంతో పాటు హౌజ్ కు మరింత గ్లామర్ జోడించనున్నారు. ఇప్ప‌టికే కుమార్ సాయి, అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు.

Related Posts