లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

రిపబ్లిక్ డే ప‌రేడ్‌లో ఫ్లైపాస్ట్‌.. మొదటి మ‌హిళగా పైల‌ట్ స్వాతి!

Published

on

Flypast the Republic Day Parade : ఎయిర్ ఫోర్స్ ఫ్ల‌యిట్ లెఫ్టినంట్ స్వాతి రాథోడ్ అరుదైన ఘ‌న‌త‌ను సాధించనున్నారు. గ‌‌ణ‌తంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రిపబ్లిక్ డే ప‌రేడ్‌లో మంగళవారం వైమానిక విన్యాసాలు (ఫ్లైపాస్ట్) జరుగనున్నాయి. ఈ వైమానిక విన్యాసాలకు మ‌హిళా పైల‌ట్ స్వాతి రాథోడ్ నేతృత్వంలో జరుగనున్నాయి. తద్వారా ప్లెపాస్ట్ విన్యాసాలకు నాయకత్వం వహించిన తొలి మహిళగా అవతరించనున్నారు.
స్వాతి స్వస్థలం.. రాజ‌స్థాన్‌లోని నాగౌర్ జిల్లా. అజ్మీర్ నుంచి స్వాతి తన స్కూల్ విద్య పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే పైల‌ట్ కావాల‌ని క‌ల‌లు కనేవారు. 2014లో తొలి ప్రయత్నంలోనే ఆమె ఐఏఎఫ్‌కు ఎంపికైంది. స్వాతి సోద‌రుడు నేవీలో ప‌నిచేస్తున్నాడు. ఆమె తండ్రి రాష్ట్ర వ్యవసాయ శాఖలో డిప్యూటీ డైరెక్టర్. 2013లో ఎయిర్ ఫోర్స్ కామ‌న్ అడ్మిష‌న్ ప‌రీక్ష రాసింది.
Swati Rathore Becomes First Woman To Lead Republic Day Parade2014 మార్చిలో డెహ్రాడూన్‌లోని ఎయిర్ ఫోర్స్ సెల‌క్ష‌న్ బోర్డు ఆమెను ఇంట‌ర్వ్యూ కాల్ వచ్చింది. 98 మంది మ‌హిళా విద్యార్థుల‌ను స్క్రీనింగ్ చేయగా.. వారిలో స్క్రీనింగ్ త‌ర్వాత ఐదుగురే మిగిలారు. వారిలో స్వాతి మాత్రమే ఫ్ల‌యింగ్ బ్రాంచ్‌కు ఎంపికయ్యారు. ఫిబ్రవరి 2020లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సాయుధ దళాలలో మహిళలకు శాశ్వత కమిషన్ ఇచ్చింది. ఫ్లైపాస్ట్ వైపు దూసుకెళ్లే రాథోడ్ ఖచ్చితంగా దేశానికి ఒక మైలురాయిగా చెప్పవచ్చు.