లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Health

మనకు ఫేస్ మాస్క్‌లు ఇక అవసరం లేదు.. ఎందుకంటే?

Published

on

covid-19 vaccine

Sweden says no need for face masks as COVID-19 deaths : ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే దిశగా ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడతున్నాయి. అయితే కరోనా కేసుల సంఖ్య పెరిగినప్పటికీ మరణాల సంఖ్య తక్కువగా ఉండటంతో పెద్దగా భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటోంది స్వీడన్ ప్రభుత్వం.. అందుకే స్వీడన్‌కు ఇంకా ఫేస్ మాస్క్‌లు అవసరం లేదని అంటోంది. స్పీడన్ లో మొత్తంగా 7వేలపైనా కరోనా మరణాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మాస్క్‌లు ఎప్పుడు ధరించాలి అనేదానిపై పలు సూచనలు చేసింది. WHO ప్రకటన తర్వాతి రోజున స్వీడన్ ఉన్నత ఆరోగ్య అధికారి ఒకరు తమకు మాస్క్ లు అవసరం లేదన్నారు.కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నచోట, పిల్లలు, 12 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు విద్యార్థులతో పాటు దుకాణాలు, కార్యాలయాలు, తగినంత వెంటిలేషన్ లేని పాఠశాలల్లో మాత్రం తప్పకుండా మాస్క్‌లు ధరించాలని సూచించింది. అలాగే వెంటిలేషన్ సరిగా లేని గదులలో కూడా జాగ్రత్తగా ఉండాలని, ప్రెష్ ఎయిర్ లోపలికి వచ్చేలా చూసుకోవాలని WHO సూచనలు చేసింది.స్వీడన్‌లో నో-లాక్ డౌన్ వ్యూహం వెనుక స్వీడన్ హెల్త్ ఏజెన్సీ ఉందని, అందుకే మాస్క్‌లు అవసరం లేదనే సిఫారసు చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. వైరస్ ప్రభావం, లక్షణాలు ఉన్నవారు మాత్రమే మాస్క్‌లు ధరించవచ్చునని, వారు ఐసోలేట్ కావాల్సిన పనిలేదని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఫేస్ మాస్క్‌లు అవసరం కావచ్చు. స్వీడన్‌లో ఆ పరిస్థితులు ఇంకా తలెత్తలేదని స్వీడన్ చీఫ్ ఎపిడెమియాలజిస్ట్ Anders Tegnell అన్నారు.మాస్క్ లు పెట్టుకోవాల్సిన పరిస్థితి పెద్దగా లేదని WHO స్పష్టం చేసింది. ఫేస్ మాస్క్ కలిగి ఉండటం కంటే భౌతిక దూరాన్ని పాటించడం చాలా ముఖ్యమని ఇప్పటివరకు చేసిన అన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయని ఆండ్రెస్ అన్నారు. స్వీడన్ లో గురువారం 35 కొత్త కరోనా మరణాలు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,007కు చేరుకుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *