Home » కన్నకొడుకుని 28 ఏళ్లుగా గదిలో బంధించిన తల్లి..పళ్లు ఊడిపోయి..అత్యంత దీన దుస్థితిలో..
Published
2 months agoon
By
nagamaniswedish woman locking son for 28 years : కన్న బిడ్డకు చిన్న నలత చేస్తేనే కన్నతల్లి మనస్సు తల్లడిల్లిపోతుంది. అటువంటిది ఓ తల్లి కొడుకును నరకం అంటే ఏంటో భూమ్మీదే చూపించింది. చావకుండా బతక్కుండా చిత్రహింసలకు గురిచేసింది. అలా ఒకరోజు రెండు రోజులుకాదు..నెలలు కూడా కాదు ఏకంగా 28 సంవత్సరాల పాటు నరకం చూపించింది. 28 ఏళ్లుగా గదిలో బంధించి చిత్ర హింసలు పెట్టింది. సరిగా తిండి పెట్టకుండా..నీళ్లు ఇవ్వకుండా ఒకే గదిలో పెట్టింది. మలమూత్రాలు కూడా అక్కడే ఇక అతడి పరిస్థితి వర్ణించటానికే వీల్లేదు. దాదాపు 30 ఏళ్లపాటు తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన అతనికి ఇటీవలే విముక్తి దొరికింది.
ఆరోగ్యం పూర్తిగా పాడైపోయి.. నోట్లో పళ్లు అన్నీ ఊడి పోయి అత్యంత దీన స్థితిలో బతికి బైటపడ్డాడు. ఇటీవలే ఆ ఇంటికి సంబంధించిన బంధువు పోలీసులకు ఈ విషయాన్ని తెలపటంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ అభాగ్యుడికి 28 ఏళ్ల తర్వాత గత మంగళవారం (ఇండియా కాలమానం ప్రకారం డిసెంబర్ 1,2020)విముక్తి లభించింది. ఇప్పుడతనికి 40 సంవత్సరాలు. ఆ తల్లికి ఇప్పుడు 70 ఏళ్లు. అంటే దాదాపు అతని జీవితంలో సగభాగం తల్లి చేతిలో హింసలు అనుభవించటానికే సరిపోయింది.
వివరాల్లోకి వెళితే..స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ దక్షిణాన ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో 28 ఏళ్ల క్రితం 12 సంవత్సరాల వయస్సు ఉన్న తన కుమారుడిని ఓ తల్లి స్కూల్ మాన్పించింది. అనంతరం అతడిని ఇంట్లోని ఓ గదిలో బంధించింది. అప్పటి నుంచి ఆ పిల్లాడికి భోజనం, నిద్ర, బాత్రూం అంతా అదే గదిలోనే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గది దాటి ఒక్క అడుగు కూడా బైటపెట్టనివ్వలేదు ఆ తల్లి. ఒక్కసారి కూడా ఆ గదిని శుభ్రం చేయలేదంటే ఆ కన్నతల్లి ఎంతటి శాడిస్టో అర్థం చేసుకోవచ్చు.
ఇటీవల ఆ మహిళ అనారోగ్యానికి గురి కావడంతో బంధువులకు తెలిసింది. ఆమెను చూడటానికి వారుంటే అపార్టుమెంట్ కు ఓ బంధువు వచ్చాడు. అక్కడ ఓ రూమ్ నుంచి మూలుగులు వినిపించటంతో ఆ రూమ్ తలుపులు తెరిచి చూసిన ఆ వ్యక్తి అత్యంత దీన దుస్థితిలో పడి ఉన్న ఆమె కొడుకుని చూసి షాక్ అయ్యాడు. 40 ఏళ్ల వయస్సు ఉన్న అతను బాలుడిలా కనిపించటంతో మొదట భయపడ్డాడు.
అతను ఉన్న రూమ్ అంతా దుమ్ము ధూళితో మలమూత్రాలతో అత్యంత దుర్ఘంథంగా నిండిపోయి ఉంది. అతని శరీరం అంతా పుండ్లుమయంగా ఉంది. ఇంటిలో అంతకాలానికి ఓ కొత్త వ్యక్తి కనిపించేసరికి అతనికి ప్రాణం లేచి వచ్చినట్లైంది.మాటలు కూడా రాని పరిస్థితిలో ఏవేవో సైగలు చేశాడు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సదరు వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. వెంటనే ఘటనాస్థలానికి అంబులెన్స్ సహా వచ్చిన పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.
అయితే ఆ బాధితుడిని చూసిన పోలీసులే కన్నీరు పెట్టుకున్నారు. దీన్ని బట్టి అతను ఎటువంటి దారుణ స్థితితో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. అతడిని పరీక్షించిన డాక్టర్లు ప్రాణానికి ప్రమాదం లేదని..కానీ కొంతకాలం చికిత్స్ చేయాలని తెలిపారు.
బాధితుడి నోటిలో పళ్లే లేవని డాక్టర్లు గుర్తించారు. అతడి శరీరంపై ఉన్న గాయాల వల్ల తల్లే అతడిని దారుణంగా కొట్టి ఉంటుందని అందుకే పళ్లు ఊడిపోయి ఉంటాయని భావించారు. ప్రస్తుతం అతని ప్రాణాలకు ప్రమాదం లేదని..కానీ మానసికంగా అతను కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు.
ఈ విషయం గురించి పోలీసులు చుట్టు పక్కల వారిని ప్రశ్నించగా.. ఆ వృద్ధ మహిళ ఎవరినీ ఇంటికి రానిచ్చేది కాదని..ఆమె కూడా ఎవ్వరితోను పెద్దగా మాట్లాడేది కాదని తెలిపారు. కొడుకు గురించి అడిగితే మీకేందుకు మా ఇంటి విషయాలు అంటూ గొడవపడేదని పోలీసులకు తెలిపారు. ఈ విషయపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ మహిళను అరెస్టు చేశారు.