Home » ‘సిగ్నల్’కు స్విచ్ అవుతున్నారా? : మీ వాట్సాప్ గ్రూపులను కొత్త యాప్‌కు ఇలా మార్చండి!
Published
5 days agoon
Switching WhatsApp Groups To Signal App : వాట్సాప్ ప్రైవసీ పాలసీ అడుగుతోంది. ఇప్పుడూ అందరూ ‘సిగ్నల్’ కొత్త యాప్‌కు మారిపోతున్నారు. వాట్సాప్ బైబై.. సిగ్నల్ హాయ్.. హాయ్ అంటూ తమ ఫోన్లలో కొత్త యాప్ ఇన్ స్టాల్ చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 8లోగా ప్రతి వాట్సాప్ యూజర్ యాప్ ప్రైవసీ పాలసీని యాక్సప్ట్ చేయాల్సిందే. లేదంటే యాప్ పనిచేయదు. ఇప్పటికే వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా తమ యూజర్లందరికి నోటిఫికేషన్ల ద్వారా మెసేజ్‌లు పంపుతోంది.
దాంతో చాలామంది యూజర్లు ప్రైవసీ దృష్ట్యా వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా సిగ్నల్ యాప్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. వాట్సాప్ లాగే సిగ్నల్ యాప్ కూడా ఎన్ క్రిప్టడ్ మెసేజింగ్ యాప్.. గతవారంలో ఈ సిగ్నల్ యాప్ భారీగా డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది.. మరి.. ఇప్పటివరకూ వాట్సాప్ గ్రూపులు, కాంటాక్టుల మాటేంటి? వాట్సాప్ అకౌంట్లోని గ్రూపులు, యూజర్ ప్రొఫైల్స్ ఎలా మైగ్రేట్ చేసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
సిగ్నల్ యాప్ కు స్విఫ్ట్ కావాలనుకునే వాట్సాప్ యూజర్ల కోసం కొత్త యాప్ సిగ్నల్ ఆప్షన్ అందిస్తోంది. వాట్సాప్ సహా ఇతర మెసేజింగ్ సర్వీసుల నుంచి గ్రూపులను ఇంపోర్ట్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. గ్రూపులో చేరిన ఒక్కో యూజర్ ను యాడ్ చేయాల్సిన అవసరం లేదు. యూజర్లు ఈ కింది షార్ట్ కట్ ఫాలో అయితే.. ఒకేసారి ఎక్కువ మంది వాట్సాప్ గ్రూపు యూజర్లను సిగ్నల్ కొత్త యాప్ లోకి మార్చుకోవచ్చు. అదేలానో చూద్దాం..
– సిగ్నల్ యాప్.. ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోండి.. ఫోన్లో ఇన్ స్టాల్ చేయండి.
– మీ మొబైల్ నంబర్ ద్వారా సిగ్నల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి.
– కొత్త గ్రూపు క్రియేట్ చేసి.. పేరు అసైన్ చేయండి.
– గ్రూపుకు ఫొటో కూడా యాడ్ చేయొచ్చు. (ఆప్షనల్)
– గ్రూపులో ఏదైనా ఒక కాంటాక్ట్ నంబర్ మ్యానివుల్ గా యాడ్ చేయండి.
– గ్రూపు సెట్టింగ్స్ లోకి వెళ్లండి. ‘Group Link’ టర్న్ ఆన్ (turn on) చేయండి.
– Share ఆప్షన్ పై Tap చేయండి.. వాట్పాప్ గ్రూపులకు లింకు షేర్ చేయండి.
– ఏ వాట్సాప్ గ్రూపు ఇంపోర్ట్ చేయాలో ఆ గ్రూపుకు Invite Link షేర్ చేయండి.
– ఇతర ఏదైనా వాట్సాప కాంటాక్ట్ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు.
– వాట్సాప్ గ్రూపులోని యూజర్లు ఈ లింకు ద్వారా సిగ్నల్ గ్రూపులో యాడ్ కావొచ్చు.
ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా సిగ్నల్ యాప్ లోకి మారాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి.. వాట్సాప్ నుంచి సిగ్నల్ కు జంప్ కొట్టండి.