లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Bigg Boss 4

మాట ఇచ్చాడు.. సోహైల్ నిలబెట్టుకున్నాడు..!

Published

on

Syed Sohel donates 10lakhs : మొత్తానికి సయ్యద్ సోహైల్ అన్న మాటనిలబెట్టుకున్నాడు. మాట ఇచ్చినట్టుగానే అనాథ ఆశ్రమాలకు రూ.10 లక్షలు డొనేట్ చేశాడు. బిగ్ బాస్ సీజ‌న్ 4లో సోహెల్ తనదైన గేమ్ ఆడుతూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హౌస్ లో ఉన్నంతకాలం స్నేహాల‌ు, రిలేషన్లకు విలువ ఇచ్చాడు.

బిగ్ బాస్ నుంచి వ‌చ్చిన రెమ్యున‌రేష‌న్‌లో రూ. 10 ల‌క్ష‌లు చారిటీకి ఇస్తాన‌ని చెప్ప‌డం సోహైల్ మంచితనానికి నిద‌ర్శ‌నంగా నిలిచింది. బిగ్ బాస్ విన్న‌ర్ క‌న్నా ఎక్కువ క్రేజ్ సోహెల్ కే వచ్చింది. హీరోగా కూడ చాన్స్ వచ్చింది. ఓ సినిమాకు కూడా సైన్ చేశాడంట.

బిగ్ బాస్ ఫినాలే రోజు త‌న‌కు వ‌చ్చిన రూ. 25 ల‌క్ష‌ల‌లో రూ.10 లక్షలను అనాధ ఆశ్రమానికి ఇస్తానని మాటిచ్చాడు సోహెల్. అన్న‌ట్టుగానే 5 అనాధ ఆశ్రమాలను ఎంపిక చేసుకున్నాడు. ఒక్కో అనాథ అశ్రమానికి రూ.2 లక్షల చొప్పున విరాళం ఇచ్చాడంట. భ‌విష్య‌త్‌లో తాను సంపాందించిన మొత్తంలో 10 నుండి 15 శాతం వరకు విరాళం ఇస్తానని ప్రకటించాడు. దాంతో నెటిజన్లంతా సోహైల్ ఔన్నత్యంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *