T20 World Cup in 2020 'unrealistic': Cricket Australia chairman

ప్రపంచకప్-టీ20పై క్రికెట్ ఆస్ట్రేలియా కీలక వ్యాఖ్యలు 

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో ప్రతీ ఆట కూడా ఆగిపోయింది. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్‌ను నిర్వహించడంపై క్రికెట్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు ఎర్ల్ ఎడ్డింగ్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. షెడ్యూల్ తేదీలలో టోర్నమెంట్ నిర్వహించడానికి మార్గాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. 

కరోనా వైరస్ ఆందోళనల కారణంగా ప్రయాణ ఆంక్షలతో, టోర్నమెంట్‌ నిర్వహించడం చాలా కష్టంగా మారిందని ఎడ్డింగ్స్ అభిప్రాయపడ్డారు. అయితే మేము ఇంకా టోర్నమెంట్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించలేదు. 16 దేశాలను ఆస్ట్రేలియాకు తీసుకువచ్చి, ఆపై పోటీ పడితే ఎలా ఉంటది అనే విషయాలపై చర్చిస్తున్నాం అని అన్నారు.

అయితే అన్ని దేశాలు కరోనా మహమ్మారితో పోరాడుతున్న సమయంలో.. ఆస్ట్రేలియాలో కూడా నిరంతరం కేసులు పెరుగుతున్న పరిస్థితిలో, దీన్ని చేయడం కుదరకపోవచ్చునని ఎడ్డింగ్స్ తెలిపారు. వచ్చే నెలలో టోర్నమెంట్ భవిష్యత్తు గురించి ఐసిసి నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. 

ఈ ఏడాది పురుషుల టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉంది. పురుషుల ప్రపంచకప్ 2020, అక్టోబరు 18 నుంచి నవంబరు 15వరకు జరగనుంది. దీనిలో భాగంగా ఫైనల్‌ సహా మొత్తం 45 మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్ సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య జరుగాల్సి ఉంది.

గ్రూప్-ఏలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్,న్యూజిలాండ్, రెండు క్వాలిఫయర్ జట్లు, గ్రూప్-బిలో ఇండియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, రెండు క్వాలిఫయర్ జట్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు నిర్వహణ విషయంలో క్లారిటీ రావట్లేదు.

Related Posts