లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

పనికిరాదన్నారు.. పనైపోయింది అన్నారు.. కట్ చేస్తే..

Published

on

Taapsee Pannu: ఒకప్పుడు స్టార్ హీరోలు సిక్స్‌ప్యాక్, మస్కులర్ బాడీ చేస్తే పెద్ద న్యూస్. కానీ ఇప్పుడు హీరోయిన్లు ఈ రూట్‌లో వెళ్తున్నారు. స్పెషల్లీ ఈ పంజాబీ బ్యూటీ తాప్సీ సినిమా కోసం అథ్లెట్ ట్రైనింగ్ తీసుకుంటోంది. క్యారెక్టర్ కోసం మస్క్యులర్ బాడీతో ఆడియన్స్‌కి షాకిస్తోంది. అమ్మాయిలే అసూయ పడేలా ఆ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో అందరినీ సర్‌ప్రైజ్ చేస్తోంది.


హీరోయిన్‌గా పనికి రాదన్నారు.. అసలు ఎవరు హీరోయిన్‌గా ఆఫరిస్తారా చూద్దాం అనుకున్నారు. తీరా హీరోయిన్ అయ్యాక పెద్దగా సినిమాలు లేక ఫేడవుట్ అయ్యిందన్నారు.

అదే హీరోయిన్ ఇప్పుడు బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. తాప్సీ వరుస సక్సెస్‌లతో వుమెన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ.. రేసులో తానే ఫస్ట్ వస్తూ.. అందర్నీ వెనక్కి నెట్టేస్తోంది.వరుసగా వుమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తున్న తాప్సీ, క్యారెక్టర్ కోసం హీరోల కంటే ఎక్కువే కష్టపడుతోంది. ప్రస్తుతం చేస్తున్న ‘రష్మీ రాకెట్’ సినిమా కోసం అథ్లెట్ ట్రైనింగ్ తీసుకుని మరీ రన్నర్‌కి కావల్సిన లెగ్‌స్ట్రెన్త్ కోసం టఫ్ వర్కౌట్స్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Taapsee Pannu (@taapsee)

కంప్లీట్ మస్కులర్ బాడీతో షూట్ స్టార్ట్ చేసింది తాప్సీ. దీనికి సంబందించి రన్నింగ్ ట్రాక్‌లో తాప్సీ పరిగెడుతున్న ఫోటోలో లెగ్ మజిల్స్ చూసి ఫ్యాన్స్‌తో పాటు స్టార్లు కూడా సర్‌ప్రైజ్ అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Taapsee Pannu (@taapsee)

లేటెస్ట్‌గా ‘రష్మి రాకెట్’ కి సంబందించి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిందీ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో పాటు ప్యార్లల్‌గా ‘లూప్ లపేటా’ అనే మరోసినిమా చేస్తోంది తాప్సీ. ‘రష్మి రాకెట్’ స్టార్ట్ అయ్యే వరకూ ‘లూప్ లపేటా’ సినిమాతో బిజీ అవ్వబోతోంది.

 

View this post on Instagram

 

A post shared by Taapsee Pannu (@taapsee)


సినిమాకి తగ్గట్టు క్యారెక్టర్‌లోకి మారిపోతూ వర్క్ పట్ల తనకున్న డెడికేషన్, కమిట్‌మెంట్ చూపిస్తోంది. తన పనైపోయిందనుకుంటున్న వాళ్లకి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నానని చెబుతోంది తాప్సీ.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *