tablighi-jamaat-attendees-tamil-nadu-come-forward-donate-plasma-covid-19-treatment

COVID-19తో పోరాటంలో ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకొచ్చిన తబ్లిగీ జమాత్ సభ్యులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తబ్లిగీ జమాత్ సభ్యులు ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ వేదికగా సమావేశమైన ఘటనతో కేసుల వ్యాప్తి పెరిగిపోయింది. గత నెల ఢిల్లీలో జరిగిన ఈ సమావేశం కారణంగానే కేసుల తీవ్రత పెరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. కారణం అక్కడికి వెళ్లి వచ్చిన వారిలో కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదు కావడమే. అప్పుడు ఆ నిందలు మోసిన వారే సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. 

తమిళనాడు నుంచి జమాత్ కు వెళ్లిన సభ్యులు కరోనా పాజిటివ్ ను ఎదురించి పోరాడారు. ప్రస్తుతం వైరస్ తో బాధపడుతూ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న వారిని కాపాడాలని ముందుకొచ్చారు. భారత ప్రభుత్వం కొత్తగా ప్లాస్మా థెరఫీతో వైరస్ ను తగ్గించాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కరోనా నుంచి కోలుకున్న వారెవరైనా ప్లాస్మాను దానం చేసి ఆదుకోవాలంటూ కోరారు. 

 

ప్లాస్మాలో ఉన్న యాంటీబాడీస్ డొనేట్ చేసేందుకు తమిళనాడు నుంచి వెళ్లిన జమాత్ సభ్యులు ముందుకొచ్చారు. వారి రక్తంలో ఉన్న ప్లాస్మాను కొవిడ్ 19తో బాధపడుతున్న వారికి ఎక్కించి వైరస్ నుంచి ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని అందిస్తారు. ఇదే ప్లాస్మా థెరఫీ. ముహమ్మద్ సాద్ కంధల్వి(54)  అనే తబ్లిగీ జమాత్ సభ్యుడు క్వారంటైన్లో ఉన్న సోదరులను కాపాడేందుకు ముందుకొచ్చాడు. 

ఏ ఇన్ఫెక్షన్ లేకపోయినా కరోనా పాజిటివ్ అని తేలడంతో ట్రీట్ మెంట్ తీసుకుని రికవరీ అయ్యాడు. ఈ సందర్భంగా తాను బ్లడ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ‘మానవత్వం చాటేందుకే తాను ఈ పనిచేసినట్లు’ చెప్పాడు. ఇంకొందరు క్వారంటైన్లోనే ఉన్నారని.. తాను లాక్ డౌన్ సమయంలో మతపరమైన సమావేశంలో పాల్గొన్నందుకుగానూ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారని తెలిపాడు. ఇటువంటి సంక్షోభ సమయంలో ప్రజల అవసరం తీర్చడం, ఆహారం, అత్యవసరమైన సదుపాయాలు, ప్రత్యేకించి పేదలకు అందజేయాలి. 

 

అంతకంటే గొప్ప బాధ్యత జబ్బు పడ్డ వ్యక్తి ఆరోగ్యం కాపాడాలి. అది మన జీవితాన్ని సంపాదనను రెట్టింపు చేస్తుంది. అంతేకాక ఆ వ్యక్తి వైరస్ నుంచి కోలుకుంటాడు. జమాత్ చీఫ్ ఇచ్చిన పిలుపుమేరకు తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో ప్లాస్మా దానం చేసేందుకు ముందుకొచ్చారు. 

Related Posts