Categories
Education and Job

దరఖాస్తుకు 2రోజులే: నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్‌లో 495 ఉద్యోగాలు

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు చెందిన సైంటిస్టు ఉద్యోగాల భర్తీకి న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్(NIC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 495 ఖాళీలు ఉన్నాయి.  ఫిబ్రవరి 26, 2020న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 26 దరఖాస్తుకు చివరితేది. ఇంకా రెండురోజులు మాత్రమే ఉంది.

ఆసక్తిగల అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్దులు సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంఎస్, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్, ఓబీసీ అభ్యర్దులు రూ.800 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులు, మహిళా అభ్యర్దులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. 

అభ్యర్దులను రాతపరీక్ష, ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.  జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 35 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు 33 ఏళ్లు. దివ్యాంగులకు 40 ఏళ్లు వయసు ఉండాలి. 

Also Read | చెక్ ఇట్ : NPCILలో ఎగ్జిక్యూటివ్ ట్రేయినీ ఉద్యోగాలు