Categories
Education and Job

NFLలో సీనియర్ కెమిస్ట్, మేనేజర్ ఉద్యోగాలు

దేశవ్యాప్తంగా నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్‌ లో సీనియర్ కెమిస్ట్, మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇందులో మొత్తం 24 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.   

విద్యార్హతలు: 
అభ్యర్ధులు బ్యాచిలర్ డిగ్రీ, M.Sc, BDS, MBBS అర్హత కలిగి ఉండాలి.

విభాగాల వారీగా పోస్టులు: 
సీనియర్ కెమిస్ట్ 6, మేనేజర్ 2, సీనియర్ మేనేజర్ 3, ట్రాన్స్ పోర్టేషన్ ఆఫీసర్ 5, మెడికల్ ఆఫీసర్ 8.
 
ఎంపిక విధానం: 
అభ్యర్ధులను షార్ట్ లిస్ట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: 
SC, ST అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు, జనరల్, OBC అభ్యర్ధులు మాత్రం రూ.700 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు చివరితేది: నవంబర్ 9, 2019.

ఆన్ లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Also: దరఖాస్తు చేసుకోండి: నేవిలో అప్రెంటీస్ పోస్టులు