Categories
National

లీవ్ లెటర్స్ ఇంగ్లీష్ లోనే రాయాలి.. యూపీ పోలీసులకు ఆదేశాలు

ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌ జిల్లా పోలీసులందరూ.. ఇకపై లీవ్ లెటర్స్ ను ఇంగ్లీష్ లోనే రాయాలని సూపరింటెండెంట్ ఆఫ్ పోలిస్ (SP) డెన్ రంజన్ వర్మ ఆదేశించారు. గత వారంలో పలు పోలీసు స్టేషన్లలో వర్క్‌షాపులు, ఇంగ్లీష్ క్లాసెస్ నిర్వహించిన అనంతరం SP ఈ ఆదేశాలు జారీ చేశారు. అందరూ తప్పనిసరిగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదివటం అలవాటు చేసుకోవాలని తెలిపారు. దీంతో జిల్లా పోలీసు సిబ్బంది ఇప్పటికే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పుస్తకాలు, డిక్ష్నరీలు కొనడం ప్రారంభించారు. 

ఈ ఆదేశాలపై అడిషనల్ డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) పివి రామశాస్త్రి మాట్లాడుతూ… ఉత్తర్వుల గురించి తన వద్ద ఎలాంటి సమాచారం లేదని, జిల్లా స్థాయిలో నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అయితే తనకు కూడా ఈ నిర్ణయం గురించి ఎలాంటి సమాచారం లేదని దేవిపతన్ డివిజన్ డిఐజి రాకేశ్ సింగ్ తెలిపారు. ఉన్నత స్థాయి నుండి అలాంటి సూచనలు ఏవీ లేవు. ఇంగ్లీష్ వాడకం ముఖ్యమా కాదా అనేది విధానపరమైన నిర్ణయం. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, డిజిపి, ఇతర అధికారులు పోలీస్ సిబ్బందికి ఏ నైపుణ్యాలు అవసరమో అంచనా వేస్తారు. దీని గురించి తాను ఇంకేమీ చెప్పలేనని రాకేష్ సింగ్ తెలిపారు. 

అయితే బలరాంపూర్ ఎస్పీ వర్మ మాట్లాడుతూ.. నేను చెప్పిన దానీ వెనుక కారణం అన్ని సైబర్ క్రైమ్ మరియు నిఘా సమాచారం ఇంగ్లీషులో ఉంటుంది కనుక పోలీసులకు భాషపై కనీస అవగాహన ఉండాలి. ఎందుకంటే పోలీసులను చాలా మంది తప్పుదోవ పట్టించడం నేను చూశాను. కోర్టు నిర్ణయాలను ఇంగ్లీష్ లో అర్థం చేసుకోవడం. దీని తరువాత పోలీసు సిబ్బంది కనీసం ప్రాథమిక ఇంగ్లీషు నేర్చుకునేలా చొరవ తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.