Categories
Education and Job Latest

IBPS, RRBలో 9వేలకు పైగా పీవో, క్లర్క్ జాబ్స్

ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ (రీజనల్‌ రూరల్‌ బ్యాంక్స్‌) లో పివో, క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 9698 ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్దులు నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు.

విభాగాల వారీ ఖాళీలు:
ఆఫీస్‌ అసిస్టెంట్ : 4682
ఆఫీసర్‌ స్కేల్‌ I : 3800
ఆఫీసర్‌ స్కేల్‌ II(General Banking Officer) : 838
ఆఫీసర్‌ స్కేల్‌ II(Agricultural Officer) : 100
ఆఫీసర్‌ స్కేల్‌ II(IT) : 59
ఆఫీసర్‌ స్కేల్‌ II(Law) : 26
ఆఫీసర్‌ స్కేల్‌ II(CA) :26
ఆఫీసర్‌ స్కేల్‌ II(Marketing Officer) : 8
ఆఫీసర్‌ స్కేల్‌II(Treasury Manager) : 3
ఆఫీసర్‌ స్కేల్‌ III : 156

విద్యార్హత : అభ్యర్దులు బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ, లా పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్దులు రూ.850 చెల్లించాలి. SC,ST,దివ్యాంగులు రూ.175 చెల్లించాలి.

ఎంపికా విధానం : అభ్యర్దులను ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యతేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : జూలై 1, 2020.
దరఖాస్తు చివరి తేదీ: జూలై 21, 2020.

Read:ఆన్ లైన్ డిగ్రీ కోర్సు ప్రారంభించిన మద్రాస్ IIT

Categories
National

ఇండియన్ ఆయిల్‌లో 600 ఉద్యోగాలు

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్(IOCL)లో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 20, 2020 నాటికి దరఖాస్తు గడువు ముగిసింది. కానీ కరోనా వైరస్ సంక్షోభం నెలకొనడంతో మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో మరో 100 పోస్టులను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మెుత్తం 600 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. 

ఫిబ్రవరి 22, 2020 నుంచి మార్చి 20, 2020 మధ్య అప్లై చేసిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో అప్లై చేసిన దరఖాస్తులే పరిగణలోకి తీసుకుంటుంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్హత : అభ్యర్దులు ఇంజనీరింగ్ డిప్లామా ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.

వయసు : అభ్యర్దుల వయసు 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపికా విధానం : అభ్యర్దులను కంప్యూటర్ బేస్ టెస్ట్, ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు. 

ముఖ్య తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ : మే 22, 2020. 

దరఖాస్తు చివరి తేదీ : జూన్ 21, 2020.

Read: లాక్‌డౌన్‍‌తో వాయిదా పడిన SSCపరీక్షల రీ-షెడ్యూల్

Categories
Education and Job

NACLO లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలు

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NACLO)లో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 120 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విభాగాల వారీగా ఖాళీలు :
మెకానికల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ – 45
ఎలక్ట్రాకల్, పవర్ ఇంజనీరింగ్ – 29
ఇన్ స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ – 15
కెమికల్ ఇంజనీరింగ్ – 9
మెటల్లార్జికల్ ఇంజనీరింగ్ – 13
సివిల్ – 5
ఆర్కిటెక్చర్, సిరామిక్స్ ఇంజనీరింగ్ – 5
మైనింగ్ ఇంజనీరింగ్ , డిప్లామా – 4
 
విద్యార్హత : అభ్యర్దులు 55 శాతం మార్కులతో బీటెక్, టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. 2019, 2020 గేట్ లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు : అభ్యర్దుల వయసు మార్చి 20, 2020 నాటికి 30 సంవత్సరాలకు మించరాదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వడ్ అభ్యర్దులకు వయసులో మినహాయింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ, EWS అభ్యర్దులకు రూ.500 చెల్లించాలి. SC,ST,దివ్యాంగు అభ్యర్దులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

ముఖ్య తేదీలు : 
దరఖాస్తు ప్రారంభ తేదీ : మార్చి 20, 2020.
దరఖాస్తు చివరి తేదీ : ఏప్రిల్ 4, 2020. 

Categories
Education and Job

చెక్ ఇట్ : NPCILలో ఎగ్జిక్యూటివ్ ట్రేయినీ ఉద్యోగాలు

ముంబాయిలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా  లిమిటెడ్ (NPCIL) లో ఎగ్జిక్యూటివ్ ట్రేయినీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 200 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ మార్చి 24, 2020 నుంచి ప్రారంభం కానుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విభాగాల వారీగా ఖాళీలు : 
మెకానికల్ – 85
కెమికల్ -20
ఎలక్ట్రికల్ – 40
ఎలక్ట్రానిక్స్ – 8
ఇన్ స్ట్రూమెంటేషన్ – 7
సివిల్ – 35
ఇండ్రస్ట్రియల్ అండ్ ఫెయిర్ సేఫ్టీ – 5

విద్యార్హత : అభ్యర్దులు సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్, బీఎస్సీ (ఇంజనీరింగ్), ఐదేళ్ల సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. 2018, 2019, 2020 గేట్ లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు : అభ్యర్దుల వయస్సు 26 సంవత్సరాల  ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వడ్ అభ్యర్దులకు వయసులో సడలింపులు వర్తిస్తాయి.

ఎంపికా విధానం : అభ్యర్దులను వ్యాలిడ్ గేట్ స్కోర్ , మెరిట్ లిస్ట్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ, EWS అభ్యర్దులు రూ.500 చెల్లించాలి. SC,ST, దివ్యాంగులు, ఎక్స్ -సర్వీస్ మెన్, మహిళా అభ్యర్ధులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 

ముఖ్య తేదీలు : 
దరఖాస్తు ప్రారంభ తేదీ : మార్చి 24, 2020.
దరఖాస్తు చివరి తేదీ : ఏప్రిల్ 2, 2020.

Also Read | ఆచార్య నాగార్జున యూనివర్సిటీ PGCET 2020 నోటిఫికేషన్ రిలీజ్

Categories
Education and Job

NLC లో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు

భారత ప్రభుత్వానికి చెందిన నవరత్నసంస్థ అయిన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్(NLC) ఇండియా లిమిటెడ్ లో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 259 ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విభాగాల వారీగా ఖాళీలు :
మెకానికల్ – 125
ఎలక్ట్రికల్(EEE) – 65
ఎలక్ట్రికల్(ECE) – 10
సివిల్ – 5
కంట్రోల్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్  – 15
కంప్యూటర్ – 5
మైనింగ్ – 5
జియాలజీ – 5
ఫైనాన్స్ – 14
హ్యూమన్ రిసోర్స్ – 10

విద్యార్హత : అభ్యర్దులు సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, లా, సీఏ, సీఎంఏ, ఎంటెక్, ఎంఎస్సీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు : అభ్యర్దుల వయసు మార్చి 1, 2020 నాటికి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వడ్ అభ్యర్దులకు వయసులో సడలింపులు వర్తిస్తాయి.

ఎంపికా విధానం : కంప్యూటర్ బేస్ టెస్టు, ఇంటర్వూ ద్వారా అభ్యర్దులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్దులు రూ.854 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులు, ఎక్స్ – సర్వీస్ మెన్ అభ్యర్దులు రూ.354 చెల్లించాలి.
 
ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : మార్చి 18, 2020.
దరఖాస్తు చివరి తేదీ : ఏప్రిల్ 17, 2020.
పరీక్ష తేదీ : మే 26, 2020 నుంచి మే 27, 2020.

Also Read | నా బర్త్‌డే సెలబ్రేట్ చేయద్దు: రామ్ చరణ్

Categories
Education and Job

BECIL లో 4 వేల ఉద్యోగాలు: దరఖాస్తు గడువు పొడిగింపు

బ్రాడ్ క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL) లో 4 వేల ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తు గడువు జనవరి 11, 2020 తో ముగుసింది. తాజాగా దరఖాస్తు గడువును మార్చి 20, 2020 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు పలు కారణాల వల్ల దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్కిల్డ్, అన్ స్కిల్డ్ మ్యాన్ పవర్ గా పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విభాగాల వారీగా ఖాళీలు :
స్కిల్డ్ మ్యాన్ పవర్ ట్రైనీ ప్రోగ్రామ్ – 2000
అన్ స్కిల్డ్ మ్యాన్ పవర్ ట్రైనీ ప్రోగ్రామ్ – 2000

విద్యార్హత : అభ్యర్థులు 8వ తరగతి పాసై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్,ఓబీసీ అభ్యర్ధులు రూ.500 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపికా విధానం : అభ్యర్దులను డాక్యూమెంట్ వెరిఫికేషన్, మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వయసు : అభ్యర్ధుల వయసు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వడ్ అభ్యర్దులకి వయసులో సడలింపులు వర్తిస్తాయి. 

ముఖ్య తేదిలు :
దరఖాస్తు ప్రారంభ తేది : డిసెంబర్ 27,2019.
దరఖాస్తు చివరి తేది : మార్చి 20,2020.

Also Read | MLA: ‘నేను చచ్చిపోయాక నన్ను మర్చిపోకూడదు..అందుకే నా విగ్రహాలు చేయించా’

Categories
Education and Job

చెక్ ఇట్ : హైదరాబాద్ వాటర్ బోర్డులో మేనేజర్ ఉద్యోగాలు

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సివరేజ్ బోర్డు (HMWSSB) లో మేనేజర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 93 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ మార్చి 16 నుంచి ప్రారంభం కానుంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం TSPSC అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు. 

అభ్యర్దులు దరఖాస్తు చేసుకోవటానికి ముందుగా TSPSC అధికారిక వెబ్ సైట్ లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్(OTR) అవ్వాలి. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అయ్యిన అభ్యర్దులు వారి TSPSC ఐడీ నెంబర్, పుట్టిన తేదీని ఎంట్రర్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. 

విభాగాల వారీగా ఖాళీలు :
సివిల్ ఇంజనీరింగ్ – 79
మెకానికల్ ఇంజనీరింగ్ – 6
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ – 4
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ – 3
కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ – 1

అర్హతలు : అభ్యర్దులు సంబంధిత విభాగాల్లో బీటెక్, బీఈ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు : అభ్యర్దులు వయసు జూలై 1, 2020 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వడ్ అభ్యర్దులకు వయసులో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు : అభ్యర్దులు రూ.320 చెల్లించాలి. బీసీ, SC,ST,  దివ్యాంగులు, ఎక్స్ – సర్వీస్ మెన్ ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపికా విధానం : అభ్యర్దులను రాత పరీక్ష, స్కిల్ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు. 

ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : మార్చి 16, 2020.
దరఖాస్తు చివరి తేదీ : మార్చి 30, 2020. 

Categories
Education and Job

భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో అప్రెంటిస్ ఉద్యోగాలు

భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 150 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.(తూర్పు రైల్వేలో 2వేలకు పైగా అప్రెంటిస్ ఉద్యోగాలు)

విభాగాల వారీగా ఖాళీలు : 
ఫిట్టర్ – 16
టర్నర్ – 4
ఎలక్ట్రీషియన్ – 14
ఎలక్ట్రానిక్ మెకానిక్ – 19
మెషినిస్ట్ – 5
డ్రాప్ట్స్ మెన్(సివిల్) – 4
డ్రాప్ట్స్ మెన్(మెకానికల్) – 9
రిఫిజిరేటర్ & ఎయిర్ కండిషనర్ మెకానిక్ – 4
ఎలక్ట్రోప్లేటర్ – 4
వెల్డర్ – 2
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ – 69

విద్యార్హత : అభ్యర్ధులు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు : అభ్యర్దుల వయసు 21 సంవత్సరాలలోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపులు వర్తిస్తాయి.

ఎంపికా విధానం : అభ్యర్దులను రాతపరీక్ష, ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.

ముఖ్య తేదీలు : 
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 28, 2020.
దరఖాస్తు చివరి తేదీ : మార్చి 16, 2020.  

See Also | ఇషా ఇంట హోళీ వేడుకల్లో బాలీవుడ్ తారలు

Categories
Education and Job

DRDO లో అప్రెంటిస్ ట్రైనీ ఉద్యోగాలు

కాంబాట్ వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అవాడి నుంచి అప్రెంటిస్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 116 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విభాగాల వారీగా ఖాళీలు : 
కార్పెంటర్ – 2
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(COPA) – 23
డ్రాఫ్ట్స్ మెన్ – 5
ఎలక్ట్రీషియన్ – 20
ఎలక్ట్రానిక్స్ – 2
మెషినిస్ట్ – 11
ఫిట్టర్ – 33
మోటార్ వెహికల్ మెకానిక్ – 5
పెయింటర్ – 2
ఫ్లంబర్ – 2
టర్నర్ – 5
వెల్డర్ – 6

విద్యార్హత : అభ్యర్దులు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు : అభ్యర్దుల వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వడ్ అభ్యర్దులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపులు వర్తిస్తాయి.

ఎంపికా విధానం : అభ్యర్దులను డాక్యూమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.

ముఖ్య తేదీలు : 
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 29, 2020.
దరఖాస్తు చివరి తేదీ : మార్చి 21, 2020.

Categories
Education and Job

SSCలో 1.40లక్షల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి శుభవార్త.  స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు గ్రూప్-B,C లలో దాదాపు 1.40లక్షల ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ సందర్భంగా చైర్మన్ బ్రజ్ రాజ్ శర్మ మాట్లాడుతూ.. నాన్ టెక్నికల్ తో పాటు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులను దశలవారీగా భర్తీ చేస్తామని చెప్పారు. 

ఇప్పటికే 14వేల 611 మంది అభ్యర్థులను ప్రభుత్వానికి నియామకం కోసం సిఫారసు చేసినట్లు తమ అధికారిక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాల్లో సుమారు 85వేల పోస్టులను భర్తీ చేయడానికి కమిషన్ ఫలితాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉందని మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రివెన్సెస్ అండ్ పెన్షన్స్ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

2020 నుంచి 21 ఆర్థిక సంవత్సరంలో అదనంగా 40వేల ఖాళీలను కమిషన్ భర్తీ చేసే అవకాశం ఉందని శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) దిగువ, మధ్య పోస్టులకు నియామకం కోసం  పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. పోస్టును బట్టి 18 నుంచి 30 ఏళ్ల వయస్సువారు దరఖాస్తు చేయొచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.