Categories
Uncategorized

YSR రైతు భరోసా పథకానికి వీరు అనర్హులు

ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతోంది. ప్రధానంగా YSR రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొంటోంది. అక్టోబర్ 15వ తేదీ నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. విధి విధానాలను దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు.

ఏటా రూ. 12 వేల 500 చొప్పున నాలుగేళ్లలో  రూ. 50 వేల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 8 వేల 750 కోట్లు కేటాయించింది. లబ్దిదారులను ఎంపిక చేసేందుకు సెప్టెంబర్ 18 నుంచి 25వ తేదీ వరకు సర్వే నిర్వహించనున్నారు అధికారులు. ఇక్కడ కౌలు రైతులకు మేలు చేసేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. భూ యజమానుల డేటాను స్క్రూటీ చేసి, అర్హులు ఎవరు ? అనర్హులు ఎవరు ? గుర్తిస్తారు. అర్హుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచుతారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఈ పథకం అమలుకు నోడల్ సంస్థగా పనిచేస్తుంది. 

పథకం ఎవరెవరికి వర్తించదు : – 
> వ్యవసాయ భూములను ఇళ్ల పట్టాలుగా మార్చుకున్న వారు
> వ్యవసాయ భూములను ఆక్వా చెరువులుగా మార్చుకున్న ఆక్వా రైతులు. 
> వృత్తి పరమైన సంస్థల కింద రిజిష్టర్ అయి..తమ వృత్తులను కొనసాగిస్తున్న డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, చార్టెర్డ్ అకౌంట్లు, ఆర్కిటెక్‌లు. 
> నెలకు రూ. 10 వేలు లేదా అంతకు మించి పెన్షన్ పొందుతున్న వారు. 
> ప్రభుత్వ సేవల్లో ఉన్నా..లేదా..పదవీ విరమణ పొందిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, మంత్రిత్వ కార్యలయాలు, వాటి అనుబంధ విభాగాల్లో పనిచేసిన వారు. 
> గతంలో లేదా..ప్రస్తుతం మంత్రులుగా, సహాయ మంత్రులుగా ఉన్నవారు.
> గతంలో లేదా ఇప్పుడు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, శాసనమండలి సభ్యులుగా, మేయర్లుగా, జిల్లా పరిషత్ ఛైర్మన్‌లుగా పనిచేసిన వారి కుటుంబాలకు. 
> రాజ్యాంగపరమైన పదవులు నిర్వహించినా..ప్రస్తుతం నిర్వహిస్తున్న వారి కుటుంబాలకు.
> సంస్థాగత భూ యజమానులు.
> ప్రభుత్వ రంగ సంస్థలు, వాటి అనుబంధ కార్యాలయాలు, ప్రభుత్వ పరిధిలోకి వచ్చే స్వతంత్ర ఉద్యోగులు, స్థానిక సంస్థల రెగ్యులర్ ఉద్యోగులు.