Categories
Andhrapradesh Latest

సీఎం జగన్ మరో గుడ్ న్యూస్, రేపే 47వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నియామక పత్రాలు జారీ

* ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం
* ‘ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌’(APCOS) ద్వారా ప్రయోజనం
* శుక్రవారం(జూలై 3,2020) క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కార్యక్రమం
* 47వేల మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు నియామక పత్రాలు జారీ
* లంచాలకు, సిఫారసులుకు తావులేదు
* దళారీల ప్రమేయం లేదు
* మత, ప్రాంత వివక్షకు తావులేదు
* ఠంచనుగా నెల తిరిగేసరికి పూర్తి జీతం
* ESI, EPF విధానాలు సక్రమంగా అమలు
* ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు యాభై శాతం అవుట్‌ సోర్స్‌ ఉద్యోగాలు
* మొత్తంగా యాభై శాతం ఉద్యోగాలుమహిళలకు
* అవుట్‌ సోర్సింగ్‌ సేవల్లో పారదర్శకత
* దళారీతనం, లంచగొండితనం, అవినీతి నిర్మూలన
* ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పూర్తిగా వేతనాలు చెల్లింపు
* ఏజెన్సీల పేరిట కమీషన్ల దోపిడీకి అడ్డుకట్ట

‘ఔట్‌ సోర్సింగ్‌ పేరుతో లంచాలు తీసుకోవడం, ఉద్యోగం కోసం లంచాలు.. తర్వాత జీతాలు ఇవ్వాలి అంటే మాకింత ఇస్తేనే అని చెప్పి అక్కడా లంచాలు.. ఇటువంటి పరిస్థితిలో టోటల్‌గా ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ అంతా కూడా నష్టపోతున్నారు’. ‘ఇలాంటి పరిస్థితుల్లో వ్యవస్థలో పూర్తిగా మార్పులు తీసుకువస్తూ ఉద్యోగులకు వీలైనంత వరకు ప్రయోజనం కలిగే విధంగా, ఆ ఉద్యోగుల కోసం ప్రభుత్వమే స్వయంగా ఒక ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీగా ఏర్పడి, నేరుగా వారికి సేవలందించేందుకు, వారి జీతాలు ఏ మాత్రం తగ్గకుండా వారికే మొత్తం అందేలా చూడడం కోసం, ఎక్కడా కూడా లంచాలు అనే పరిస్థితి రాకుండా ఉండడం కోసం.. ఆంధ్రప్రదేశ్‌ ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తున్నాం’. అసెంబ్లీ సాక్షిగా 2019 డిసెంబర్ 17న ఈ ప్రకటన చేసిన సీఎం జగన్, ఇప్పుడు దాన్ని కార్యరూపం దాల్చేలా చేశారు. అందుకు అనుగుణంగా ప్రత్యేకంగా ‘ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌’ (ఆప్కాస్-APCOS‌) ఏర్పాటవుతోంది.

శుక్రవారం(జూలై 3,2020) ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో ఆప్కాస్‌ ద్వారా ఉద్యోగాలు పొందుతున్న వారితో మాట్లాడతారు. ఈ సందర్భంగా 47 వేల మందికి అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌ జారీ చేస్తారు.

కార్పొరేషన్‌ లక్ష్యం:
ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వీలైనంత వరకు ప్రయోజనం కలిగించడం, కోతలు లేకుండా వారి వేతనాలు పూర్తిగా చెల్లించడంతో పాటు, ఎక్కడా అవినీతి, లంచాలకు తావు లేకుండా చేయడం. ఇంకా ఆయా ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి, వాటన్నింటిలో మహిళలకు 50 శాతం ఇవ్వడం కూడా ఆప్కాస్‌ లక్ష్యం.

ఆప్కాస్‌ ప్రధాన విధులు:
* పూర్తి పారదర్శక విధానంలో స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్‌ స్కిల్డ్‌ మ్యాన్‌ పవర్‌ గుర్తింపు.
* వివిధ శాఖలు, సంస్థల అవసరాలు తీర్చే విధంగా పూర్తి శాస్త్రీయ కోణంలో కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బంది ఎంపిక.
* ఎక్కడా అవినీతి, లంచాలకు తావు లేకుండా ఆ కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పూర్తి వేతనాలు అందేలా చూడడం.
* చట్టబద్ధంగా వారికి ఉన్న సదుపాయాలు.. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌)తో పాటు, ఈఎస్‌ఐ వంటివి అందేలా చేయడం.
* హౌజ్‌ కీపింగ్, సెక్యూరిటీ, కేటరింగ్, వాహనాల అద్దె వంటి కార్యకలాపాలు నిర్వహించే ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ సంస్థలను గుర్తించి, వారి అవసరాల మేరకు ఉద్యోగులను ఆప్కాస్‌ ద్వారా అందించండి.
* రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థలు, కార్యాలయాల్లో అవసరమైన ఔట్‌ సోర్సింగ్‌ ప్రక్రియలన్నింటికీ ‘వన్-స్టాప్-షాప్‌’ గా ఆప్కాస్‌ పని చేస్తుంది.

100 శాతం ప్రభుత్వ రంగ సంస్థ:
* ఏ మాత్రం లాభాపేక్ష లేకుండా ఈ కార్పొరేషన్‌ పని చేస్తుంది. ఇది నూటికి నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వ సంస్థ.

ఆప్కాస్‌లో ఎవరెవరు?:
* ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌కు ఛైర్మన్‌గా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి లేదా ప్రభుత్వ కార్యదర్శి వ్యవహరిస్తారు. ఒక మేనేజింగ్, మరొక ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లతో పాటు, ఆరుగురు డైరెక్టర్లు ఉంటారు.
* ఆర్థిక శాఖకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి లేదా ప్రభుత్వ కార్యదర్శి, ఏపీ హెచ్‌ఆర్‌డీ సంస్థ డీజీ, న్యాయ శాఖ కార్యదర్శి, కార్మిక శాఖ కమిషనర్‌తో పాటు, మానవ వనరుల రంగానికి చెందిన ఇద్దరు నిపుణులు ఈ కార్పొరేషన్‌ డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు.
* కార్పొరేషన్‌కు తగిన సూచనలు, సలహాలు అందించేందుకు నలుగురు సభ్యులతో కూడిన ఒక అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేస్తారు.

కార్పొరేషన్‌తో ప్రయోజనాలు:
* ప్రైవేటు ఔట్‌ సోర్సింగ్‌ సంస్థలు, దళారులు తొలగిపోతారు.
* అవినీతి లేకుండా ఔట్‌ సోర్సింగ్

Read:ఏపీలో 16వేలు దాటిన కరోనా కేసులు, ఆ 3 జిల్లాల్లో పరిస్థితి భయానకం

Categories
Political

గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చిన జగన్

ఏపీలో అక్టోబరు 2 గాంధీ జయంతి రోజు నుంచి కొత్త ప్రజా పరిపాలనా వ్యవస్ధ అమల్లోకి  వస్తోంది.  గాంధీజీ కలలుకన్న స్వరాజ్య స్ధాపన స్ఫూర్తితో సీఎం జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇందుకోసం 1లక్షా 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోని పలు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబరు 30న విజయవాడలోని ఎ-ప్లస్‌ కన్వెన్షన్‌ హాలులో జరిగిన  కార్యక్రమంలో  సీఎం జగన్ నియామక పత్రాలు అందచేసారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన దాదాపు 5 వేల మంది అభ్యర్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

ప్రజా సంబంధిత సేవలకు సంబంధించి ఇప్పుడు అమలవుతున్న విధానంలో  కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  మండల కేంద్రాల్లోని తహసిల్దార్, మండల పరిషత్,  వ్యవసాయ శాఖ,సహకార వ్యవస్ధలపై ప్రఝలు ఆధార పడాల్సి వస్తోంది.  చిన్నధృవీకరణ పత్రానికి సైతం  వారాలు తరబడి  వేచి చూడాల్సి వస్తోంది. ఇక ఇప్పుడా పరిస్ధితి ఉండదు. ప్రతి సచివాలయంలోనూ 10 మంది వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు  అందుబాటులో ఉంటారు. అక్టోబరు 2 నుంచి పౌర సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ కార్యాలయాల్లో  ఆర్జీలు అందించిన 72 గంటల్లో  పూర్తయ్యే 10 సేవలను ఈ సచివాలయాల ద్వారా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ సేవలను క్రమేపీ పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది.   ఈ కార్యాలయాల ద్వారా  జనన,మరణ ధృవీకరణ పత్రాల నమూనాలను  వెంటనే అందచేస్తారు.
ప్రతిరోజు గ్రామ సచివాలయాల్లో స్పందన కార్యక్రమం కొనసాగుతుంది.  

వైసీపీ ఎన్నికల మేని ఫెస్టోలో రూపోందించిన నవరత్నాలలోని అమ్మఒడి,ఆరోగ్యశ్రీ , రైతు భరోసా, ఫించన్లు,  ఫీజు రీఎంబర్స్ మెంట్  తదితర పధకాలకు సంబంధించిన సేవలన్నింటినీ సచివాలయాల ద్వారా అమలు చేస్తారు. ప్రతి గ్రామంలో  వార్డులో జనాభాను అనుసరించి  సచివాలయాలను ఏర్పాటు చేయటం జరిగిందని అధికారులు చెప్పారు. ఈ కార్యాలయాల పరిధిలో ఆయా పధకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. ప్రభుత్వం  ఇప్పటికే ఆయా సేవలకు సంబంధించిన ఉద్యోగులకు విధి విధానాలను, బాధ్యతలకు సంబంధించి అవగాహన సదస్సు, శిక్షణను అందచేసింది. ఆయా గ్రామాల్లో వార్డుల్లో  సచివాలయాలకు కార్యాలయాల నిర్వహణకు భవనాలను ఎంపిక చేసి వాటిలో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నారు.

Categories
Uncategorized

సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు రెడీ

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను సిద్ధం చేశారు అధికారులు. సోమవారం (సెప్టెంబర్ 30, 2019) అపాయింట్ మెంట్ ఆర్డర్లను

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను సిద్ధం చేశారు అధికారులు. సోమవారం (సెప్టెంబర్ 30, 2019) అపాయింట్ మెంట్ ఆర్డర్లను అందజేయనున్నారు. విజయవాడలో సీఎం జగన్‌ చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక ప్రతాలు అందించనున్నట్టు అధికారులు తెలిపారు. జిల్లాల్లో ఇన్‌ఛార్జ్ మంత్రులు అపాయింట్ మెంట్ లెటర్లు ఇవ్వనున్నారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉద్యోగులతో సీఎం జగన్ మాట్లాడనున్నారు. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ప్రారంభం కానుంది. ఇకపై స్థానిక సంస్థల్లో పరిపాలనా వ్యవహారాలు వీటి ద్వారానే సాగనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కరపలో సచివాలయాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు.

సెప్టెంబర్ 30వ తేదీలోగా నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్ది రెడ్డి తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్లను ఇవ్వడంతోపాటు స్వచ్ఛాంధ్ర కింద మరో రూ.5 కోట్లు కేటాయిస్తామన్నారు. ఈ నిధులను గ్రామ సచివాలయాల నిర్మాణంతో పాటు అంగన్‌వాడీల నిర్మాణానికి వినియోగిస్తామన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించడమే సీఎం జగన్‌ ఉద్దేశమన్నారు.

ప్రతి 2 వేల జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేసి, అన్ని రకాల ప్రభుత్వ సేవలు వాటి ద్వారా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణాల్లోనూ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గ్రామ, వార్డు సచివాలయంలో ఇప్పటికే నియమించిన గ్రామ వాలంటీర్లకు తోడుగా మరో 10మంది చొప్పున సిబ్బందిని నియమిస్తున్నారు. ఇందుకోసం ఇంటర్, డిగ్రీ, టెక్నికల్ విద్యార్హతలు కలిగిన మొత్తం లక్షా 26వేల 728 పోస్టులను భర్తీకి సెప్టెంబర్ మొదటివారంలో పరీక్షలు జరిగాయి.

మొత్తం 10 రకాల పోస్టులు వీటిలో ఉన్నాయి. ఈ పరీక్షలకు 19లక్షల 58వేల 582 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వివిధ విభాగాల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి వారిలో లక్షా 98వేల 164 మందిని ప్రభుత్వం అర్హులుగా ప్రకటించింది. కొన్ని పోస్టులకు ఉన్న ఖాళీల కంటే తక్కువ మంది అర్హత సాధించగా, మరికొన్ని పోస్టులకు గట్టి పోటీ ఏర్పడింది. ఎంపికైన వారికి రెండు రోజులపాటు శిక్షణ ఇస్తారు. అక్టోబర్ 2న విధుల్లోకి తీసుకుంటారు.

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పౌర సేవలను 72 గంటల్లో అందిస్తారు. ప్రస్తుతం వార్డు సచివాలయాల్లో 10 సేవలను ప్రారంభిస్తామన్నారు. తర్వాత దశల వారీగా సేవల సంఖ్య పెంచుతారు. ఒక్కో వార్డు సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉంటారు. వారిలో పరిపాలన కార్యదర్శి ‘స్పందన’ కార్యక్రమంతో పాటు ఇతర సేవలను పర్యవేక్షిస్తారు.

Categories
Uncategorized

సచివాలయ ఉద్యోగాలు: సెప్టెంబర్ 30న జగన్ చేతుల మీదుగా!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైన వారికి సెప్టెంబర్ 30వ తేదీన నియామక పత్రాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలి నియామక పత్రాన్ని విజయవాడలో సీఎం జగన్‌ చేతుల మీదుగా అందజేస్తారు.

జిల్లాల్లో జిల్లాల ఎంపిక కమిటీ (డీఎస్సీ)ల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు.

సీఎం జగన్ నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత అక్కడ నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాలకు ఎంపికైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు జగన్. పదమూడు జిల్లాల్లో ఉద్యోగాలకు ఎంపికైనవారు సీఎం ప్రసంగాన్ని వీక్షించేలా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు అధికారులు. రాత పరీక్షల్లో ఉత్తీర్ణులై సెప్టెంబర్‌ 30 నాటికి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తికాకుంటే వారికి వెరిఫికేషన్‌ పూర్తయిన వెంటనే అక్కడికక్కడే నియామక పత్రాలు ఇస్తారు.

సచివాలయ వ్యవస్థకు తూర్పు గోదావరి జిల్లాలో అక్టోబర్ 2వ తేదీన ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. అక్టోబర్‌ 2న కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని కరప గ్రామంలో సచివాలయ భవనంను సీఎం ప్రారంభిస్తారు. ఆ రోజు నుంచే సచివాలయ ఉద్యోగులు విధుల్లో చేరుతారు.