Categories
Telangana

కరోనా కట్టడికి స్పెషల్ ఆఫీసర్లు నియామకం…జీహెచ్ఎంసీ సరికొత్త ప్లాన్

గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో జీహెచ్ఎంసీ సరికొత్త ప్లాన్ అమలు చేస్తోంది. వైరస్ ను కట్టడి చేసేందుకు స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. కేసులు అధికంగా ఉన్న ఒక్కో సర్కిల్ ను ఒక్కో అధికారికి అప్పగించింది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో నమోదవుతున్నాయి. ప్రధానంగా కొన్ని జోన్లు ఖైరతాబాద్, చార్మినార్ తోపాటు సికింద్రాబాద్ ప్రాంతాల్లో చాలా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అయితే గత కొద్ది కాలంగా శేరిలింగంపల్లి, కూకట్ పల్లి ప్రాంతాల్లో కేసుల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగింది. దీంతో ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రధానమైన సర్కిళ్లు ఏవైతే ఉంటాయో ఆ సర్కిళ్లకు ముఖ్యమైన అధికారులను నియమించారు.

ప్రధానంగా జీహెచ్ఎంసీలో పని చేస్తున్న అడిషనల్ కమిషనర్లు ఐఏఎస్ లుగా ఉన్నారు. వీరిలో ముగ్గురు ఐఏఎస్ లు, సీనియర్ అధికారులను, అడిషనల్ కమిషనర్లుగా పని చేస్తున్న సీరియర్ అధికారులను వివిధ ప్రాంతాల్లో నియమించారు. వారు ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో కోవిడ్ విస్తరణ ఏ విధంగా ఉంది? వైరస్ కట్టడికి జీహెచ్ఎంసీ ఇప్పటికే కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసే పనిలో ఉంది. కాబట్టి కంటైన్ మెంట్ జోన్ల ఏర్పాటు ఏ విధంగా ఉంది? అక్కడ వారికి సేవలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇంకా ఏమైనా ల్యాప్స్ ఉన్నాయా? వాటిని ఏ విధంగా ఫుల్ పిల్ చేయాలన్న అంశాలను వీరు పరిశీలిస్తారు.

ప్రధానంగా ఖైరతాబాద్ జోన్ కు సంబంధించి మెహిదీపట్నం సర్కిల్ కు శంకరయ్య, కార్వాన్ సర్కిల్ కు సంధ్య వీరిద్దరూ అడిషనల్ కమిషనర్లుగా ఉన్నారు. వీరిద్దరినీ నియమించారు. అదే విధంగా శేరిలింగంపల్లి జోన్ లోని యూసుఫ్ గూడ సర్కిల్ కు అడిషనల్ కమిషనర్ గా పని చేస్తున్న ఎన్.యాదగిరిరావును నియమించారు. చార్మినార్ జోన్ కు సంబంధించి చంద్రాయన్ గుట్ట, చార్మినార్ తోపాటు రాజేంద్రనగర్ మూడు సర్కిళ్లు చార్మినార్ పరిధిలో ఉన్నాయి. ఇందులో ఇద్దరి ఐఏఎస్ అధికారులను నియమించారు. రాజేంద్ర నగర్ కు సంబంధించి బరాబత్ సంతోష్ ను నియమించారు. చార్మినార్ సర్కిల్ కు సంబంధించి రాహుల్ రాజ్ ఐఏఎస్ ను నియమించారు. చంద్రాయన్ గుట్ట సర్కిల్ కు అడిషనల్ కమిషనర్ విజయలక్ష్మీని నియమించారు.

ప్రధానంగా అంబర్ పేటకు సంబంధించి సీనియర్ ఆఫీసర్ జయరాజ్ కెనడీ నియమించారు. కుత్బుల్లాపూర్ కు మరో ఐఏఎస్ అధికారి ప్రియాంక అలానీని నియమించారు. ఈ విధంగా ఐఏఎస్ అధికారులు, సీనియర్లు అధికారులు వైరస్ కట్టడి చేయడంతోపాటు నివారణకు తీసుకుంటున్న చర్యల్లో ఎక్కడైనా ల్యాప్స్ ఉంటే అధికారులు చెప్పడం..వారిని మినిట్ మినిట్ అప్రమత్తం చేయనున్నారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడంలో భాగంగా జీహెచ్ఎంసీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Categories
Andhrapradesh Political

సెలెక్ట్ కమిటీని అపాయింట్‌మెంట్ చేయలేరు – ధర్మాన

రెండు బిల్లులపై నియమించబడిన సెలెక్ట్ కమిటీని స్పీకర్ అపాయింట్ మెంట్ చేయలేరని వైసీపీ సభ్యులు ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. అపాయింట్ చేయకపోతే..కాలక్షేపం చేసినట్లు అవుతుందని తెలిపారు. మండలి రద్దు కాకపోతే ప్రమాదంలో పడే వారని స్పీకర్‌ను ఉద్దేశించి తెలిపారు. మండలి రద్దు వచ్చింది కనుక లక్కీగా బయటపడ్డారని, శాసనమండలిలో ఉన్న ఛైర్మన్ రూల్స్ వక్రీకరించి..తెలియక చేసుకున్నారని విమర్శించారు.

ఆయన స్పీకర్‌కు ప్రోసీజర్స్ పంపించలేదన్నారు. 2020, జనవరి 27వ తేదీ ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. శాసనమండలి రద్దుపై చర్చిస్తున్నారు. సీఎం జగన్ రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. చర్చలో ధర్మాన పాల్గొన్నారు. శాసనమండలిని రద్దు చేయాల్సిందేనని, ఇలాగే సీఎం జగన్ ధైర్యంగా ముందుకెళ్లాలని సూచించారు. 51 శాతం ప్రజలు తమకు తీర్పునిచ్చారని, ప్రజలతో తిరస్కరించబడిన టీడీపీ అభివృద్ధిని అడ్డుకొంటోందని విమర్శించారు.

బాబు నీచ రాజకీయాలకు ఇది నిదర్శనమన్నారు. సమావేశాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారని, బయట మాట్లాడే బదులు ఇక్కడకు వచ్చి అభిప్రాయాలు చెప్పవచ్చు కదా అని సూచించారు. అభివృద్ధి నిరోధక వ్యవస్థ అవసరమా అంటూ ప్రశ్నించారు. పెద్దల సభ తాత్కాలికమని అంబేద్కర్ ఆనాడే చెప్పారని సభలో గుర్తు చేశారు ధర్మాన. ఓడిపోయిన వారు..ఆ సభల్లో కూర్చొని అభివృద్ధిని అడ్డుకోవడం ఏంటీ అంటూ సూటిగా ప్రశ్నించారు.

CRDA చట్టం 171 పేజీలున్న బిల్లుపై ఎన్ని రోజులు చర్చించారని, ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చిందని తెలిపారు. తమ ప్రభుత్వం పంపించిన బిల్లు 12 పేజీలు, 4 సెక్షన్లు ఉంటే..సెలెక్ట్ కమిటీకి పంపించారని విమర్శించారు. ఏది ఏమైనా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. 

* పాదయాత్ర ద్వారా అన్ని ప్రాంతాల అభిప్రాయాలను జగన్ తెలుసుకున్నారని తెలిపారు. 
* 67 దేశాల్లో మాత్రమే ఎగువ దేశాలున్నాయి. 
* 101 దేశాల్లో పెద్దల సభలు లేవు. 
 

* బ్రిటీషర్ల ప్రోత్పాహంతోనే ఈ సభలు ఏర్పాటయ్యాయి. 
* పెద్దలకు గౌరవిస్తున్నామన్న పేరిట దేశానికి కన్నం పెట్టే పని చేశారు. 
* బ్రిటీష్ వాళ్ల వైఖరిని మహాత్మాగాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. 
* పునరావాస కేంద్రాలని ఆనాడే విమర్శలు వచ్చాయి. 

Read More : మండలి రద్దు చర్చ : బాబుకు ప్రజలు బుద్ధి చెబుతారు – ఆళ్ల కాళకృష్ణ శ్రీనివాస్  

Categories
Telangana

బ్రేకింగ్ : తెలంగాణ కొత్త సీఎస్ సోమేష్ కుమార్

ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ కొత్త సీఎస్ ఎవరో తెలిసిపోయింది. తెలంగాణ కొత్త సీఎస్ గా సోమేష్ కుమార్ పేరు ఖరారైంది. సోమేష్ కుమార్ ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీఎం

ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ కొత్త సీఎస్ ఎవరో తెలిసిపోయింది. తెలంగాణ కొత్త సీఎస్ గా సోమేష్ కుమార్ పేరు ఖరారైంది. సోమేష్ కుమార్ ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీఎం కేసీఆర్ నియమించారు. సోమేష్ కుమార్ 1989 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో సోమేష్ కుమార్ మూడున్నరేళ్ల పాటు(2023 డిసెంబర్ 31) కొనసాగనున్నారు. కాగా నీటిపారుదల వ్యవహారాల సలహాదారుడిగా ఎస్కే జోషిని నియమించారు సీఎం కేసీఆర్.

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రెండేళ్లపాటు సేవలు అందించిన ఎస్‌కే జోషి.. ఈ నెలాఖరుకు రిటైర్‌ అయ్యారు. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలన్న అంశాన్ని సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతున్న కొందరి పేర్లపై దృష్టి పెట్టారు. ఇలాంటి వారిలో కొందరు రాష్ట్ర సర్వీస్‌లో ఉంటే.. మరికొందరు కేంద్ర సర్వీస్‌లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారుల్లో ఒకరిని సీఎస్‌గా నియమించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. చివరికి అదే జరిగింది.

సీఎస్ పదవి రేసులో సీనియర్‌ ఐఏఎస్‌లు అజయ్‌ మిశ్రా, సోమేష్ కుమార్‌, రాజేశ్వర్‌ తివారీ, శాంతికుమారి, చిత్రా రామచంద్రన్‌ల పేర్లు వినిపించాయి. అలాగే అధర్‌ సిన్హా, రాజీవ్‌ రంజన్‌ మిశ్రా, వసుధా మిశ్రా, షాలినీ మిశ్రా, బీపీ ఆచార్యల పేర్లూ వినపడ్డాయి. అయితే సీఎం కేసీఆర్ కి సన్నిహితంగా మెలిగే అధికారికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి దక్కే అవకాశం ఉందని తెలిసింది. దీంతో సీఎస్‌ రేసులో అజయ్‌ మిశ్రా, సోమేశ్‌ కుమార్‌ మధ్య ప్రధాన పోటీ ఉందని అధికార వర్గాల్లో వినిపించింది. చివరికి సోమేష్ కుమార్ వైపే సీఎం కేసీఆర్ మొగ్గుచూపారు.

Categories
National

త్రివిధ దళాధిపతి…సీడీఎస్ గా బిపిన్ రావత్

దేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్(CDS)నియామకానికి ఇవాళ(డిసెంబర్-24,2019)కేంద్రకేబినెట్ ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రిత్వ శాఖలోని మిలటరీ పవర్స్ డిపార్ట్మెంట్ కు సీడీఎస్ అధిపతిగా ఉంటారని కేబినెట్ భేటీ అనంతరం కేంద్రమంత్రి ప్రకాష్ జావడేకర్ తెలిపారు. సీడీఎస్ నియామకం దేశ అత్యున్నత రక్షణ వ్యవస్థలో ఓ పెద్ద సంస్కరణ అని జావడేకర్ తెలిపారు. 

అయితే మొదటి సీడీఎస్ పేరును ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పేరు ఇందులో ముందువరుసలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. డిసెంబ‌ర్ 31వ తేదీన ఆర్మీ చీఫ్‌గా రావ‌త్ రిటైర్‌ కానున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌నే ముందు వ‌ర‌సలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

సైనిక సంస్కరణల్లో భాగంగా త్రివిధ దళాలను సమన్యయపరిచే సీడీఎస్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే దోవల్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం, ఆ కమిటీ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఇవాళ ఆమోదం తెలపడం జరిగింది.

త్రివిధ దళాధిపతులను సీడీఎస్ డైరక్ట్ చేస్తాడు. శత్రుత్వాల విషయంలో సరైన సైనిక ప్రతిస్పందన కోసం కొత్త ఆదేశాలను సృష్టిస్తాడు.  జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియమించిన అమలు కమిటీ సిడిఎస్ కోసం చార్టర్ ను నిర్వచించింది. ప్రభుత్వానికి సింగిల్ పాయింట్ సైనిక సలహాదారుగా సిడిఎస్ ఉంటారు. కె సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కార్గిల్ సమీక్ష కమిటీ సిఫారసు చేసిన దానికి అనుగుణంగా ఇది ఉంది. 2000ఫిబ్రవరిలో ఈ కమిటీ తన రిపోర్ట్ ను పార్లమెంట్ ముందు ఉంచిన విషయం తెలిసిందే. ప్రస్తుత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తండ్రే ఈ సుబ్రమణ్యం.

Categories
Business National

NCLAT తీర్పు…టాటా చైర్మన్ గా మిస్రీ

టాటా గ్రూప్ చైర్మన్ గా సైరస్ మిస్రీని తిరిగి కొనసాగించాలని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్(NCLAT) బుధవారం(డిసెంబర్-18,2019)ఆదేశాలు జారీ చేసింది. టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఎన్ చంద్రశేఖరన్ నియామకం అక్రమమని ట్రిబ్యునల్ సృష్టం చేసింది. అంతేకాకుండా పబ్లిక్ కంపెనీని ప్రైవేట్ కంపెనీ వైపుగా టాటా గ్రూప్ అడుగులు వేయడం చట్టవిరుద్దమని ఇద్దరు సభ్యుల నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ తెలిపింది. అయితే టాటా గ్రూప్ చైర్మన్ గా మిస్రీ పునరుద్దరణ ఆదేశాలు నాలుగు వారాల తర్వాతనే అమలు అవుతాయి.అయితే ఈ నాలుగువారాల్లో టాటాలకు ఈ తీర్పును సుప్రీంలో సవాల్ చేసుకోవచ్చు.

2012లో టాటా గ్రూప్ చైర్మన్ గా రతన్ టాటా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత చైర్మన్ గా మిస్రీ బాధ్యతలు చేపట్టారు. అయితే వివిధ ఆరోపణలతో 2016అక్టోబర్ లో మిస్రీని టాటా గ్రూప్ చైర్మన్ గా తొలగించిన విషయం తెలిసిందే. మిస్రీని టాటా గ్రూప్ చైర్మన్ గా తొలగించడాన్ని సవాల్ చేస్తూ సైరస్ ఇన్వెస్ట్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్ మెంట్స్ కార్పొరేషన్ అనే రెండు పెట్టుబడిదారీ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను NCLT ముంబై బెంచ్ కొట్టివేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత మిస్రీ కూడా వ్యక్తిగతంగా NCLTని ఆశ్రయించాడు.

మిస్రీని టాటా గ్రూప్ చైర్మన్ గా తొలగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను NCLAT ముంబై బెంచ్ కొట్టివేస్తూ జులై-9న ఇచ్చిన తీర్పుని మిస్రీ క్యాంప్ సవాల్ చేసింది. మైనార్టీ షేర్ హోల్డర్స్ గా మిస్రీ కుటుంబానికి చెందిన సంస్థలు టాటా సన్స్,రతన్ టాటా,మరికొందరు బోర్డు సభ్యులకు వ్యతిరేకంగా NCLATని ఆశ్రయించాయి. తన తొలగింపు కంపెనీ చట్టంకి లోబడి జరుగలేదని మిస్రీ తన పిటిషన్ లో పేర్కొన్నాడు. దీనిపై విచారించిన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT)టాటా గ్రూప్ చైర్మన్ గా సైరన్ మిస్రీని తిరిగి కొనసాగించాలని ఆదేశించింది.

Categories
Hyderabad

తెలంగాణ రైతు సమన్వయ సమితి చైర్మన్, డైరెక్టర్‌గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, డైరెక్టర్‌గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, డైరెక్టర్‌గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి శుక్రవారం (డిసెంబర్6, 2019) ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ మినిస్టర్ హోదా కలిగిన ఈ పదవిలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.

తనను రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియమించడంపై హర్షం వ్యక్తం చేస్తూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పల్లాకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర రైతాంగాన్ని ఓ సంఘటిత శక్తిగా మార్చే సత్సంకల్పంతో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితి లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు.

రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యులను కూడా త్వరలోనే నియమించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. వచ్చే జూన్ లోపు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సమన్వయ సమితిలను బలోపేతం చేసి, రైతులను సంఘటిత శక్తిగా మార్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. క్లస్టర్ల వారీగా రైతు వేదికల నిర్మాణం కూడా పూర్తి చేయాలని ఆదేశించారు.

విత్తనం వేసిన దగ్గర నుంచి పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులకు అండగా ఉండే విధంగా రైతు సమన్వయ సమితులను పటిష్టమైన పద్ధతుల్లో తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. రైతు సమన్వయ సమితుల బలోపేతం, రైతులను సంఘటిత శక్తిగా మార్చడం, రైతు వేదికల నిర్మాణం, ఇతర రైతు సంబంధ అంశాలపై వ్యవసాయ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

Categories
Uncategorized

ఏపీలో మూడు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం

ఆంధ్రప్రదేశ్ లో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమితులయ్యారు. ఏపీ ప్రభుత్వం రెల్లి, ఎస్సీల కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది.

ఆంధ్రప్రదేశ్ లో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది ప్రభుత్వం. రెల్లి, ఎస్సీల కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. మాల కార్పొరేషన్ చైర్మన్ గా పెడపాటి అమ్మాజీ, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ గా కొమ్మూరి కనకారావు, రెల్లి కార్పొరేషన్ చైర్మన్ గా మధుసూదన్ రావును నియమించింది. ఈ మేరకు బుధవారం(డిసెంబర్ 4, 2019) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 

Categories
Education and Job Hyderabad

కొత్త టీచర్లు వస్తున్నారు

తెలంగాణలో ఇన్నాళ్లకు కొత్త టీచర్లు బడుల్లోకి రాబోతున్నారు. 2017లో జరిగిన టీఆర్‌టీ పరీక్షకు సంబంధించిన కౌన్సెలింగ్‌ పూర్తవ్వడంతో 2వేల 788మంది ఎస్జీటీలు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్స్‌ అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాన్‌ ఏజెన్సీలో మొత్తం 3వేల 127 పోస్టులను విద్యాశాఖ గుర్తించగా అందులో 2వేల 822మంది అభ్యర్థులను టీఎస్‌పీఎస్సీ ఎంపిక చేసింది. కౌన్సెలింగ్‌కు 2వేల 788 మంది హాజరుకాగా… 34మంది గౌర్హాజరయ్యారు. దీంతో వీరికి వచ్చేనెల 4న రిజిస్టర్‌ పోస్టు ద్వారా నియామక పత్రాలను అందజేస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. 

Categories
Sports

గంగూలీ నియామకంపై తొలి సారి స్పందించిన రవిశాస్త్రి

బీసీసీఐ 39వ ప్రెసిడెంట్‌గా గంగూలీ నియామకం పూర్తయిన 4 రోజులకు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఎన్నికవడం భారత క్రికెట్ సరైన తోవలో వెళుతుందని చెప్పడానికి నిదర్శనమని కొనియాడాడు. గతంలో పలు మార్లు వ్యక్తిగత ఇంటర్వ్యూల్లో కౌంటర్లు విసురుకున్న వారే. 

కాకపోతే గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ అయ్యేసరికి రవిశాస్త్రి ట్రాక్ మార్చినట్లు కనిపిస్తోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా రవిశాస్త్రి హెడ్ కోచ్ పదవికి గంగూలీ చెక్ పెడతాడనే స్పష్టంగా కనిపిస్తోంది. ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడిన రవిశాస్త్రి  ‘బీసీసీఐ ప్రెసిడెంట్ గా సౌరవ్ ఎన్నికైనందుకు నా హృదయపూర్వ అభినందనలు. అతని నియామకమే స్పష్టం చేస్తుంది. భారత క్రికెట్ సరైన మార్గంలో వెళుతుందని’ అని చెప్పుకొచ్చాడు.  

ఇంకా మాట్లాడుతూ.. ‘అతను సహజమైన నాయకుడు. క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌లో నాలుగైదుళ్లుగా కొనసాగుతున్న వ్యక్తి బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఎన్నికవడం కలిసొచ్చే అంశం. ఇలాంటి క్లిష్టమైన సమయంలో గంగూలీకి ఆల్ ద బెస్ట్ చెబుతున్నా’ అని వెల్లడించాడు. 

Categories
Hyderabad

కంగ్రాట్స్ దత్తాత్రేయ : రాష్ట్రపతి, మోడీ ఫోన్

బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన్ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ శ్రేణులు, దత్తన్న అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన నేతలు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..దత్తన్నకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 

తెలంగాణ రాష్ట్ర నేతలు కూడా అభినందనలు తెలిపారు. దత్తాత్రేయకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విషెష్ తెలియచేశారు. కష్టపడి పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు లభిస్తాయనడానికి ఇదే ఒక సూచకమంటున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. కొత్త పాత్రలో గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను..సార్..అంటూ తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా అభినందనలు తెలిపారు. దత్తాత్రేయ చాలా మందికి స్పూర్తి అని, సికింద్రాబాద్ నియోజకవర్గానికి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. 

బీజేపీలో కీలక నేతగా దత్తన్న ఉన్నారు. ఆయన RSSలో ప్రచారక్ గా పనిచేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో కూడా చేశారు. ఆయన పార్టీలో కీలక పదవులు చేపట్టారు. చట్టసభలో అడుగు పెట్టి కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు. 1991 నుంచి 2004 మధ్యకాలంలో సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. వాజ్ పేయి హాయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.

2014 సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరపున దత్తాత్రేయ పోటీ చేసి గెలుపొందారు. మోడీ ప్రభుత్వం తొలి కేబినెట్‌లో కార్మిక శాఖ మంత్రిగా దత్తన్న బాధ్యతలు చేపట్టారు. తర్వాత కొన్ని కారణాల వల్ల పదవి నుంచి తప్పించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ సీటు దత్తనకు ఇవ్వకుండా..కిషన్ రెడ్డికి ఇచ్చారు. ఇక దత్తాత్రేయ పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. ఈ తరుణంలో ఆయనకు గవర్నర్ పదవి కట్టబెట్టింది బీజేపీ ప్రభుత్వం.